
మింగిన గుడ్లను బయటకు వదులుతున్న పాము
తిరువనంతపురం : కోళ్ల గూటిలోకి దూరిన ఓ త్రాచుపాము ఏడు కోడిగుడ్లను మింగింది. కోళ్లలో గందరగోళాన్ని గుర్తించిన యజమాని పరీక్షించి చూడగా లోపల పాము కనిపించడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన కేరళలోని వేనాడ్‌లో చోటు చేసుకుంది. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని త్రాచుపామును కోళ్ల గూటి నుంచి బయటకు తీశాడు.
అనంతరం పాము నోటి నుంచి ఏడు గుడ్లను బయటకు వదలడాన్ని వీడియో తీశాడు. మొత్తం ఎనిమిది గుడ్లను పాము మింగినట్లు స్నేక్ క్యాచర్ సుదీప్ తెలిపాడు. గూటి నుంచి పామును బయటకు తీశాక జనం గుమిగూడటంతో అది భయపడిందని చెప్పాడు.
అందుకే వెంటనే పొట్టలోని గుడ్లను బయటకు వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయిందని వివరించాడు. పాముకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.