
భువనేశ్వర్: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పారిపోతారందరూ. అలాంటిది రెండు పాములు ఒక్కచోట చేరి, ఒకదానిని మరొకటి చుట్టుకొని భీకరంగా ఫైటింగ్ చేసుకొంటే. ఇంకెంత భయంకరంగా ఉంటుందో కదా. ఇలాంటి సంఘటన ఒడిషాలోని జాజ్‌పూర్‌లో చోటు చేసుకుంది. దీనిలో ఒకవైపు ఒక అడుగు విషం లేని కామన్ సాండ్ బొవా పాము, మరొవైపు నాలుగు అడుగుల స్పెక్టకాల్డ్ కోబ్రా నువ్వా-నేనా అన్నరీతిలో తలపడ్డాయి. రెండు పాములు కూడా ఒకదాన్నిమరొకటి చుట్టుకొని కాటు వేసుకొంటున్నాయి.
అయితే దీన్ని చూసిన సదరు గ్రామస్తులు వెంటనే స్నేక్ సోసైటీ వారికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్‌వాలంటీర్ ఆ పాములను ఒక స్టిక్ సహయంతో వేరుచేసి వాటిని జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వాటిని విడదీయండి..స్నేక్ సోసైటివారికి ధన్యవాదాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.