
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒకింత వికృత చర్యకు పాల్పడ్డారు. బుధవారం దేశాన్ని ఉద్దేశించి.. టీవీలో ప్రసంగిస్తూ.. హఠాత్తుగా ఓ వాటర్ బాటిల్ అందుకొని గుక్కపెట్టకుండా తాగేశారు. ట్రంప్ పాల్పడిన ఈ అనూహ్య చర్య ఒకప్పటి ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ సెనేటర్ మార్కో రుబియోకు ఊరటనిచ్చి ఉండాలి.
నాలుగేళ్ల కిందట రూబియోకు కూడా ఇదే తరహాలో ప్రవర్తించారు. బరాక్ ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని ఖండిస్తూ రూబియో ఉపన్యాసం ఇస్తుండగా.. మధ్యలో వాటర్ బాటిల్ అందుకొని గుక్కపెట్టకుండా నీళ్లు తాగేశారు. అప్పట్లో ట్రంప్‌తోపాటు చాలామంది ఇలా చేసినందుకు రూబియోను తిట్టిపోశారు. నాడు వరద బాధితుడిలా నీళ్లు కోసం అల్లాడాడంటూ రూబియోను తిట్టిన ట్రంపే.. ఇప్పుడు సాక్షాత్తు టీవీలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మధ్యలో వాటర్ కావాలంటూ వికృతంగా ప్రవర్తించడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఆసియా పర్యటన గురించి వివరిస్తూ.. మధ్యలో ’ఆగండి.. ఆగండి.. నీళ్లు కావాలి.. నీళ్లు లేవా’ అంటూ అడిగారు. పక్కన నీళ్ల సీసా కనిపించడంతో లైవ్ ప్రసారంలోనే బాటిల్‌ను అందుకొని ట్రంప్ గడగడ తాగేశారు. వాటర్ బాటిల్ మోమెంట్ విషయంలో రూబియోను పరిహాసం ఆడిన ట్రంపే ఇలా దొరికిపోవడంతో నెటిజన్లు ఆయన మీద సెటైర్లు, జోకులు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment