
రాజ్‌కోట్: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక‍్కడ జరుగుతున్న మొదటి టెస్టులో భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడినా.. క్రమంగా వేగం పెంచిన పుజారా 67 బంతుల్లోనే తొమ్మిది బౌండరీలతో కెరీర్‌లో 19వ హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు పరుగుల వద్ద ఓపెనర్ లోకేష్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో కలిసి వికెట్ పడకుండా ఆడుతున్నాడు.
వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. లంచ్ సమయానికి ఈ జోడి అజేయంగా 130 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. అయితే రాజ్‌కోట్‌లో వేడిని అధిగమించడానికి పుజారా వాటర్ బాటల్‌ను చెంతనే పెట్టుకున్నాడు. తన దాహార్దిని తీర‍్చుకునే క్రమంలో ఒక చిన్నసైజు వాటర్ బాటిల్‌ను జేబులోనే ఉంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియా ఇప్పుడు వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment