
గతేడాది కస్టడీ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన హీరో అక్కినేని నాగచైతన్య. సురేశ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం బ్యాప్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోన్న తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి జోడీగా కనిపించనుంది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సముద్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌స టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మత్స్యకారుడి పాత్రలో చై కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫిషర్‌మేన్ బాడీ లాంగ్వేజ్ కోసం మూడు నెలలు కష్టపడ్డానని నాగ చైతన్య వెల్లడించారు. తాజాగా నాగ చైతన్య ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. గడ్డంతో ఉన్న చైతూ ఫుల్ స్టైలిష్ లుక్‌లో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తండేల్ కథేంటంటే..
గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్లని కొన్నేళ్ల పాటు పాక్ ప్రభుత్వం జైల్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొస్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో 'తండేల్' సినిమా తీస్తున్నారు. జాలారి పాత్రలో చైతూ నటిస్తుండగా.. అతడి భార్యగా సాయిపల్లవి నటిస్తోంది. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో 'తండేల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా.. తండేల్‌కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
#TFNExclusive: Thandel Raju aka Yuvasamrat @chay_akkineni gets papped at Hyderabad airport in a fully rugged look!😎🔥#NagaChaitanya #Thandel #TeluguFilmNagar pic.twitter.com/GSdYBHreq0
— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2024