ఉత్తరాఖండ్‌కు మూడు ఎయిర్‌ పోర్టులు, 21 హెలీప్యాడ్‌లు! | Uttarakhand Will Soon Get 3 New Airports | Sakshi
Sakshi News home page

Uttarakhand: ఉత్తరాఖండ్‌కు మూడు ఎయిర్‌ పోర్టులు, 21 హెలీప్యాడ్‌లు!

Published Thu, Feb 15 2024 8:42 AM | Last Updated on Thu, Feb 15 2024 9:07 AM

Uttarakhand Will Soon Get Three New Airports - Sakshi

ఉత్తరాఖండ్‌ ఎయిర్ కనెక్టివిటీ కొత్త రెక్కలను సంతరించుకోబోతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్‌లోని విమానాశ్రయాల సంఖ్యను ఒకటి నుండి మూడుకు, హెలిప్యాడ్‌ల సంఖ్యను 10 నుండి 21కి పెంచే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. 

డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఏకైక జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుంచి 2024లో రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య  సింధియా తెలిపారు. 

గతంలో డెహ్రాడూన్ విమానాశ్రయానికి దేశంలోని మూడు నగరాలతో మాత్రమే కనెక్టివిటీ ఉండేది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం డెహ్రాడూన్ విమానాశ్రయ ఎయిర్ కనెక్టివిటీ దేశంలోని మూడు నగరాల నుండి 13 నగరాలకు చేరింది. 2014 వరకు ఈ విమానాశ్రయం నుండి 40 విమానాలు మాత్రమే నడిచేవి. 2024 చివరి నాటికి ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య 200కి పెరగనుంది. 

గత పదేళ్లలో డెహ్రాడూన్ విమానాశ్రయ కార్యకలాపాల్లో దాదాపు 130 శాతం పెరుగుదల నమోదైంది. త్వరలో ఉత్తరాఖండ్‌లో నూతన హెలిపోర్ట్‌లతో పాటు నూతన విమానాశ్రయాలు రానున్నాయి. డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్, పితోర్‌గఢ్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు విమానయాన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో ఏడు హెలిపోర్ట్‌లు ప్రారంభమయ్యాయి. వీటిలో అల్మోరా, చిన్యాలిసౌర్, గౌచర్, సహస్త్రధార, న్యూ తెహ్రీ, శ్రీనగర్, హల్ద్వానీ మొదలైనవి ఉన్నాయి. 

ధార్చుల, హరిద్వార్, జోషిమా, ముస్సోరీ, నైనిటాల్, రామ్‌నగర్‌లో కొత్త హెలిపోర్ట్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒక విమానాశ్రయం, ఏడు హెలిపోర్టులను ఏ‍ర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బాగేశ్వర్, చంపావత్, లాన్స్‌డౌన్, మున్సియరి, త్రియుగినారాయణ్‌లలో ఐదు కొత్త హెలిపోర్ట్‌లను ప్రారంభించే ప్రణాళిక సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్‌లో విమానాశ్రయాల సంఖ్య మూడుకు, హెలిపోర్టుల సంఖ్య 21కి చేరనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement