విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య ఏర్పడి మూడు గంటలు గాల్లోనే ఉన్న ఘటన ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఈ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది.
వివరాల్లోకి వెళితే..ట్విన్-టర్బోప్రోప్ బీచ్‌క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ అనే తేలికపాటి విమానంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణానికి సిద్ధమయ్యారు. సిడ్నీకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ మక్వేరీకి బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే(ఉదయం 9:30 సమయం) ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడినట్లు పైలట్ గుర్తించారు. దాంతో వెంటనే వారు ప్రయాణం ప్రారంభించిన న్యూకాజిల్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి, ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు.
విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య తలెత్తింది కాబట్టి అందులోని ఫ్యుయెల్ అయిపోవాలి. లేదంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో దాదాపు మూడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సివచ్చింది. చివరకు ఎయిర్‌క్రాఫ్ట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పోలీసులు తెలిపారు. విమానం కిందకు చేరే సమయానికి అత్యవసర సేవల్లో భాగంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌ను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సిద్ధంగా ఉంచారు. విమానంలో కొన్ని సాంకేతిక సమస్యల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ పోర్ట్ మాక్వారీకి చెందిన ఈస్టర్న్ ఎయిర్ సర్వీసెస్‌కు చెందింది. ఈ ఘటనకు సంబంధించి కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment