
సాక్షి, న్యూఢిల్లీ: వియత్నాం ప్రధాని ఫామ్ మిన్‌చిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. కొత్తగా వియత్నాం ప్రధానిగా ఎన్నికైన ఫామ్ మిన్‌చిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు ప్రధానులు చర్చించారు.భారత పర్యటనకు రావాలని మిన్‌చిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.కరోనా సెకండ్ వేవ్‌లో భారత్‌కు సహాకారం అందించిన వియత్నాం ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా కష్టకాలంలో ఇరుదేశాలు తమ సహయ,సహకారాలు కొనసాగించాలని ఇరు ప్రధానులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారత్,వియత్నాం రెండు యుఎన్ భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్నాయనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. 2022 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం ప్రధానికి సూచించారు.