primeminister
-
‘షేక్ హసీనాను మాకు అప్పగించండి’
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఆదేశ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌ఈబీఏ) ప్రెసిడెంట్ ఏఎమ్ మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌కు విజ్ఞప్తి చేశారు.దేశంలో చెలరేగిన అల్లర్ల అనంతరం తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన షేక్ హసీనా,ఆమె సోదరి షేక్ రహానాను తమకు అప్పగించాలని ఖోకాన్ భారత్‌ను కోరినట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.చదవండి : బ్రిటన్ నిరాకరణ!.. మరికొద్ది రోజులు భారత్‌లోనే హసీనాఎస్ఈబీఏ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖోకాన్ మాట్లాడారు. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెబుతూనే.. తమ దేశం నుంచి పారిపోయి విదేశంలో తలదాచుకుంటున్న హసీనాను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని వ్యాఖ్యానించారు.బంగ్లాదేశ్‌లో అమాయకుల ప్రాణాలు కోల్పోయారని, వారిని హసీనానే చంపారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఖోకాన్ దేశంలో అత్యవసర పరిస్థితికి పిలుపునివ్వాలని అన్నారు. వారం పది రోజుల్లో సుప్రీం కోర్టు న్యాయవాదులు రాజీనామాలు చేసి అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ నేతలవి సినిమా డైలాగులు : ప్రధాని మోదీ
రాట్లం: కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రధాని మోదీ సెటైర్ల మీద సెటైర్లు వేశారు. శనివారం మధ్యప్రదేశ్ రాట్లంలో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల డైలాగులు, ప్రకటనలు,వారి క్యారెక్టర్లు అన్నీ సినిమా తరహాలోనే ఉంటాయని చమత్కరించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో బట్టలు చింపుకునే పోటీ జరుగుతోందని మోదీ అన్నారు. డిసెంబర్3న ఎన్నికల రిజల్ట్ రాగానే ఇది మరింత తీవ్రం అవుతుందని చెప్పారు.కాంగ్రెస్ నేతలకు చాన్సిస్తే ప్రజల ఒంటి మీద కూడా బట్టలు చింపేస్తారని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టుకోవడం లేదన్నారు పీఎం మోదీ. వాళ్లు వారి కొడుకుల కోసం కొట్టుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎవరి కొడుకు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనేది వారి తపన అని ఎద్దేవా చేశారు.కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ఇద్దరు అగ్రనేతలు కమల్‌నాథ్, దిగ్విజయసింగ్ మధ్య అంతర్గత పోరు జరుగుతున్నవిషయం తెలిసిందే -
పాక్‌లో మాజీ ప్రధానుల అరెస్ట్ ఎందుకు? ఏఏ కేసులలో అరెస్ట్ అయ్యారు?
గత నెలలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్ల పాటు నిషేధం కూడా విధించారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ను మూడు నెలల్లోనే రెండుసార్లు అరెస్టు చేశారు. పాకిస్తాన్లో మాజీ ప్రధానిని అరెస్టు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా పలువురు మాజీ ప్రధానులు అరెస్టయ్యారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన కొద్దికాలానికే ఈ ధోరణి మొదలై, నేటికీ కొనసాగుతోంది. పాకిస్తాన్ చాలా కాలంగా సైనిక పాలనను చవిచూస్తోంది. పాక్‌లో రాజకీయ సంక్షోభం అనేది కొత్తేమీ కాదు. పాక్‌లో మాజీ ప్రధాన మంత్రుల అరెస్టు 60లలోనే మొదలయ్యింది. హుస్సేన్ షహీద్ సుహ్రావర్ది హుస్సేన్ షహీద్ సుహ్రవర్ది (సెప్టెంబర్ 1956-అక్టోబర్ 1957) పాక్ ఐదవ ప్రధానమంత్రి. జనరల్ అయూబ్ ఖాన్ ప్రభుత్వ తొలగింపునకు మద్దతు ఇవ్వడానికి సుహ్రావర్ది నిరాకరించారు. ఎలక్టోరల్ బాడీ అనర్హత ఉత్తర్వు ద్వారా జనరల్ అతన్ని రాజకీయాల నుండి నిషేధించారు. తరువాత జనవరి 1960లో అబ్డోను ఉల్లంఘించినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. జనవరి 1962లో సుహ్రావర్దిని ఎలాంటి విచారణ లేకుండానే దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కరాచీలోని సెంట్రల్ జైలులో అరెస్టు చేసి ఏకాంత నిర్బంధంలో ఉంచారు. జుల్ఫికర్ అలీ భుట్టో జుల్ఫికర్ అలీ భుట్టో 1977, సెప్టెంబరు 3న అరెస్టయ్యారు. కటకటాల వెనక్కు వెళ్లిన పాక్ రెండో మాజీ ప్రధానిగా నిలిచారు. జుల్ఫికర్ భుట్టో అరెస్టుకు ముందు 2 నెలల పాటు పాక్ ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 1973 నుండి జూలై 1977 వరకు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అయితే 1974లో రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలో అదే ఏడాది సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. బెనజీర్ భుట్టో జుల్ఫికర్ అలీ భుట్టో తర్వాత ఆయన కూతురు బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. బెనజీర్ రెండు సార్లు పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. ఆమె డిసెంబర్ 1988లో మొదటిసారిగా ప్రధానమంత్రి పీఠం ఎక్కారు. 1990, ఆగస్టు వరకు పదవిలో కొనసాగారు. దీని తరువాత ఆమె 1993, అక్టోబర్‌లో రెండవసారి ప్రధానమంత్రి అయ్యారు. 1996 నవంబర్ వరకు పదవిలో కొనసాగారు. పాకిస్తాన్లో జియావుల్ హక్ నియంతృత్వ పాలనలో (1977 నుండి 1988 వరకు) ప్రతిపక్ష నేతగా బెనజీర్ క్రియాశీలకంగా వ్యవహరించారు. 1986 ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కరాచీలో జరిగిన ర్యాలీలో బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్టయ్యారు. నవాజ్ షరీఫ్ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా అరెస్టును ఎదుర్కోవలసి వచ్చింది. నవాజ్ షరీఫ్ 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణంగా దేశ బహిష్కరణకు గురయ్యారు. అయితే 2007 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. ఆయన ఇస్లామాబాద్ చేరుకున్నంతనే అరెస్టు చేశారు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్‌ను సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. 2018 జూలైలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు అతని కుమార్తె మరియం నవాజ్‌ను అవినీతి కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) అరెస్టు చేసి, పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆయన రెండు నెలల తర్వాత విడుదలయ్యారు. 2018 డిసెంబర్లో సౌదీ అరేబియాలోని స్టీల్ మిల్లుల యాజమాన్యానికి సంబంధించిన కేసులో షరీఫ్ తిరిగి జైలు పాలయ్యారు. ఈ కేసులో ఏడేళ్ల శిక్ష అనుభవించారు. షాహిద్ ఖాకాన్ అబ్బాసీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నేత షాహిద్ ఖాకాన్ అబ్బాసీ 2017, జనవరిలో దేశ ప్రధానమంత్రి అయ్యారు. 2018 మే వరకు ఆ పదవిలో కొనసాగారు. షాహిద్ ఖాకాన్ అబ్బాసీ కూడా అరెస్టును ఎదుర్కోవలసి వచ్చింది. 2019 జూలై 19 న కాంట్రాక్టులకు సంబంధించిన కుంభకోణంలో ప్రమేయముందుంటూ అబ్బాసీని ఎన్ఏబీ బృందం అతన్ని అరెస్టు చేసింది. ఈ కుంభకోణం చోటుచేసుకున్న సమయంలో ఆయన పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే అరెస్టయిన 7 నెలల తర్వాత అబ్బాసీ బెయిల్ పొందారు. 2020, ఫిబ్రవరి 27న అడియాలా జైలు నుండి విడుదలయ్యారు. ఇది కూడా చదవండి: అమెరికాలో సెటిలయ్యేందుకు ‘దొంగపెళ్లి’.. చుక్కలు చూపించిన అధికారులు! -
గన్ షాట్: గుజరాత్ మోడల్ పేపర్
-
కరోనా సోకినా.. వీల్ ఛైర్‌పై ప్రమాణస్వీకారానికి హాజరై!
పరాగ్వే: కరోనా వైరస్ సోకితే వెంటనే వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్లోకి వెళుతాము. అయితే కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్న చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ మాత్రం.. ప్రత్యేక పరిస్థితుల్లో దేశ నూతన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రెసిడెంట్ మిలోస్ జెమాన్.. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గాజు బాక్స్‌లోకి వీల్‌ఛైర్ మీద వచ్చి పీటర్ ఫియాలా చేత ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించారు. చదవండి: Omicron: పెను ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు ఎన్నికల్లో పీటర్ ఫియాలా నేతృత్వంలోని సెంటర్-రైట్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అధ్యక్షుడు మిలోన్.. అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. చదవండి: చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్లో ప్రవేశం ఇక కొత్త ప్రధాని ఫియాలా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతికుల సవాళ్లు ఎదుర్కొనే గడ్డు కాలంలో ఉందని తెలిపారు. అయితే భవిష్యత్తులో తమ ప్రభుత్వం దేశంలో మార్పు తీసుకువస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. కరోనా కాలంలో సేవలందించిన వ్యైదులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. -
వియత్నాం ప్రధానితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: వియత్నాం ప్రధాని ఫామ్ మిన్‌చిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు. కొత్తగా వియత్నాం ప్రధానిగా ఎన్నికైన ఫామ్ మిన్‌చిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు ప్రధానులు చర్చించారు.భారత పర్యటనకు రావాలని మిన్‌చిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.కరోనా సెకండ్ వేవ్‌లో భారత్‌కు సహాకారం అందించిన వియత్నాం ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇరుదేశాలు తమ సహయ,సహకారాలు కొనసాగించాలని ఇరు ప్రధానులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారత్,వియత్నాం రెండు యుఎన్ భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్నాయనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. 2022 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం ప్రధానికి సూచించారు. -
లద్దాఖ్‌లో ప్రధాని మోదీ పర్యటన
-
చైనాకు ప్రధాని మోదీ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడ్డారు. విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని చెప్పారు. భారత్ శాంతి యత్నాలకు స్పందించని చైనాపై మండిపడుతూ బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు.భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు భారత్‌లో లడఖ్ అంతర్భాగమని స్పష్టం చేశారు. కష్టసమయంలో మనం పోరాటం చేస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని అన్నారు. శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు. మీ కసిని పోరాట పటిమను ప్రత్యర్ధులకు రుచిచూపించారని అన్నారు. లడఖ్ నుంచి కార్గిల్ వరకూ మీ ధైర్యం అమోఘమని సైనికులను ప్రశంసించారు. దేశమంతా సైనికులను చూసి స్ఫూర్తి పొందుతోందని అన్నారు. మీ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని, మీ త్యాగాలను దేశం మరువదని జవాన్ల సేవలను కొనియాడారు. సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం నిశ్చింతంగా ఉందని అన్నారు. మన సైనికులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. మనం పిల్లనగ్రోవిని ప్రేమిస్తాం..విష్ణుచక్రాన్నీ ప్రేమిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ప్రధానమంత్రి మోదీ అంతకుముందు గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత జవాన్లను సైనిక స్ధావరం నిములో పరామర్శించారు. సరిహద్దు వివాదంపై భారత్-చైనా కమాండర్ స్ధాయి సమావేశాల్లో పాల్గొన్న సైనికాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గల్వాన్ ఘటనపై స్ధానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు. చదవండి : చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్ -
బ్రిటన్ ప్రధాని రాజీనామా
లండన్: కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే శుక్రవారం ప్రకటించారు. జూన్ 7న తాను పదవి నుంచి వైదొలగుతాననీ, తమ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానన్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి తమ సొంత పార్టీ ఎంపీల నుంచే తాను మద్దతు కూడగట్టలేకపోయాననీ, దేశ ప్రయోజనాల కోసం పదవి నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూన్ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. ‘నా జీవితకాలంలో నాకు దక్కిన గొప్ప గౌరవం ఈ పదవి. త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నాను. నేను ప్రేమించే ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో కృతజ్ఞత చూపుతూ పదవికి రాజీనామా చేస్తున్నాను తప్ప ఏ రకమైన దురుద్దేశంతో కాదు’ అని మే వెల్లడించారు. తన రాజీనామా విషయాన్ని రాణి ఎలిజబెత్–2కి ఇప్పటికే తెలియజేశాననీ, జూన్ 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమావేశాలకు తానే అధ్యక్షత వహిస్తానని మే తెలిపారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్ మాట్లాడుతూ మే ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నారనీ, ఆమెతోపాటు ఆమె పార్టీకి కూడా దేశాన్ని పాలించే బలం లేదని అన్నారు. కాగా, తదుపరి ప్రధాని రేసులో మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ముందంజలో ఉన్నారు. -
కిచిడీ ప్రభుత్వం వస్తే ఆరు నెలలకో ప్రధానమంత్రి
సాక్షి, హన్మకొండ: వివిధ ప్రాంతీయ పార్టీలతో కూడిన కిచిడీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఆరు నెలలకో ప్రధానమంత్రి మారుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. శుక్రవారం హన్మకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వీర్యమై పోయిందని, ఆ పార్టీ నాయకులు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్నట్లుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ వైపు చూస్తున్నారని, మోదీ ద్వారానే దేశానికి రక్షణ ఉంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించే సత్తా మోదీకి మాత్రమే ఉందన్నారు. నేడు నిత్యావసర వస్తువుల ధరలు చాలా తగ్గాయన్నారు. మోదీ పేదలకు ఉచితంగా గ్యాస్ ఇస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 15 మంది ఎంపీలుండి ఏం చేశారని వచ్చే ఎన్నికల్లో 16 మంది ఎంపీలు గెలిచి టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ సాధించేది ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ మతతత్వ పార్టీ ఎంఐఎంతో చేతులు కలిపి, మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25న చింత సాంబమూర్తి నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. 26న హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరాం గార్డెన్లో బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు సాంబమూర్తిని సన్మానించారు. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పెసరు విజయచంద్రారెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, గంఢ్రతి యాదగిరి చందుపట్ల కీర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గురు గోవింద్ స్మారక నాణేలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : గురు గోవింద్ సింగ్ జయంతోత్సవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ గురు నానక్ దేవ్ 550వ జయంతోత్సవాల నేపథ్యంలో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా సిక్కు సోదరులు పాకిస్తాన్‌లోని నరోవల్ దర్బార్ సాహిబ్‌కు వీసా లేకుండా ప్రయాణించవచ్చని చెప్పారు. సిక్కుల ఆరాధ్యదైవం కొలువైన ప్రాంతం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 1947 దేశ విభజనలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడం పెద్ద తప్పిదమన్నారు. దీన్ని మనం పొందలేకపోయినా కర్తార్‌పూర్ కారిడార్ ఆ బాధను కొంతమేర తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, కార్యక్రమానికి ముందు జయంతోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ గురుగోవింద్ సింగ్‌కు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. -
ఢిల్లీ వెళ్లిన కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): దేశ ప్రధానమంత్రి నుంచి ఎక్స్‌లెన్స్ పురష్కారాన్ని అందుకునేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. భూగర్భజాలాల పెంపునకు సంబంధించి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ పురష్కారానికి జిల్లా ఎంపికయింది. జాతీయ గ్రామీణ హామీ పథకం, ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్లు, నీటిపారుదల శాఖల ద్వారా జిల్లా కలెక్టర్ భూగర్భ జలాల పెంపునకు విశేషంగా కృషి చేశారు. ఫలితంగా భూగర్భ జలాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఇందుకు జిల్లాకు ఈ పురష్కారం లభించింది. జిల్లా తరుపున కలెక్టర్ గురువారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పురష్కారం అందుకోనున్నారు. -
ప్రధాని చేతుల మీదుగా...
ముచ్చటగా మూడింటికి శంకుస్థాపన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైనుకు మోక్షం రామగుండం ఎరువుల కర్మాగారం పనుల పునరుద్దరణ పనులు షురూ.. ఎన్టీపీసీ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పనుల శంకుస్థాపన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏళ్ల తరబడి కలగా మిగిలిన రామగుండం ఎరువుల కార్మాగారం పునరుద్ధరణ ఇక వేగవంతం కానుంది. తెలంగాణ స్టేజ్1లో భాగంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే 1600 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్ కల నెరవేరనుంది. జిల్లాకు సంబంధించిన ఈ మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం మధ్యాహ్నం గజ్వేల్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్ నేపథ్యాన్ని పరిశీలిస్తే... కేసీఆర్ కృషి ఫలితం కొత్తపల్లి–మనోహరాబాద్ లైన్ కరీంనగర్–హైదరాబాద్‌లను కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల మీదుగా 151.36 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మీదుగా కొత్తపల్లి వరకు రైల్వేలైన్ వేస్తారు. కొత్తపల్లిలోని కరీంనగర్–జగిత్యాల లైనుకు ఇది కలుస్తుంది. వేములవాడ–జగిత్యాల మీదుగా ధర్మపురి, లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వరకు ఈ లైనును పొడగించాలని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ రైల్వేలైన్ కోసం మెదక్ జిల్లాలో 1260 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 60 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 900 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మెదక్జిల్లాలో ఇప్పటికే 900 ఎకరాలు, వరంగల్ జిల్లాలోని 60 ఎకరాలు సేకరించి పెగ్ మార్కింగ్ చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి భూసేకరణ పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నపుడు జిల్లా కేంద్రం, రాజధానిలను కలిపేందుకు ఈ లైనును ప్రతిపాదించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ లైనుకు అయ్యే వ్యయంలో మూడోవంతును రాష్ట్ర ప్రభుత్వం భరించడంతోపాటు ఉచితంగా భూమిని సేకరించి ఇచ్చేందుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు మొదటి ఐదు సంవత్సరాల్లో రైల్వే శాఖకు నష్టం వస్తే ఆ మొత్తాన్ని కూడా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతోనే కేంద్రం ఈ లైనుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో ఎంపీ బి.వినోద్‌కుమార్ తీవ్రంగా కృషి చేశారు. త్వరలో సిరిసిల్లలో రైల్వేబ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో శంకుస్థాపన చేయించాలని కూడా ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ఎన్డీఏ హయాంలోనే మూసివేత.. పునరుద్ధరణ రామగుండం ఎరువుల కార్మాగారం గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మూతపడగా... ప్రస్తుతం అదే ఎన్డీఏ సర్కారు హయాంలో పునరుద్ధరణకు నోచుకోవడం విశేషం. అయితే పునరుద్ధరణ ప్రతిపాదన యూపీఏ ప్రభుత్వం హయాంలో పురుడుపోసుకుంది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు ఒత్తిడి తెచ్చి ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ప్రతిపాదనను కొలిక్కి తీసుకొచ్చారు. ఇంతలో యూపీఏ ప్రభుత్వం గద్దెదిగి ఎన్డీయే సర్కారు రావడంతో పునరుద్ధరణ పనులకు మోక్షం కలిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిన క్రమంలో ఎరువుల కర్మాగారం గొప్పగా వర్ధిల్లింది. అన్నపూర్ణ పేరుతో ఎరువులను తెలంగాణ ప్రాంతానికి అందించింది. అయితే సాంకేతిక లోపాలు, అప్పుల ఊబిలో కూరుకుపోవడం కారణంగా ఈ కర్మాగారంలో 1999 మార్చి 31న ఉత్పత్తిని నిలిపివేశారు. బీఐఎఫ్ఆర్కు వెళ్లిన ఈ కంపెనీకి రూ.10 వేల కోట్ల అప్పులను మాఫీ చేయడంతోపాటు గ్యాస్ ఆధారిత కర్మాగారంగా పునరుద్ధరించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) జాయింట్ వెంచర్‌గా రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తున్నారు. రోజుకు 3,850 మెట్రిక్ టన్నులు యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమోనియా ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. కాకినాడ నుంచి మల్లవరం వరకు వేసే పైపులైన్ నుంచి గ్యాస్‌ను తీసుకునేలా గుజరాత్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారం ఆవరణలోని పాత యంత్రాలు, విభాగాలను పూర్తిగా తొలగించి నేలను చదును చేశారు. యూరియా ప్రిల్లింగ్ టవర్, యూరియాను నిల్వ ఉంచే సైలో మినహా అన్నింటిని తొలగించారు. ఇందులో 500 మంది శాశ్వత ఉద్యోగులు, మరో వెయ్యి మంది ఒప్పంద కార్మికులకు ఉపాధి లభించనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 11శాతం వాటా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై నేడు ప్రధానితో ప్రకటన చేయించే అవకాశాలున్నాయి. విభజన హామీలో తొలి అడుగు.. తెలంగాణ స్టేజ్–1 తెలంగాణకు 4వేల మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. అందులో భాగంగా తెలంగాణ స్టేజ్–1 మొదటి దశ కింద 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లతో కూడిన ప్లాంట్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పూర్తిగా తెలంగాణ అవసరాలకే వినియోగించనున్నారు. ఈ ప్లాంట్ పనులు జనవరి 29న ఆరంభమైనప్పటికీ ప్రధాని చేతుల మీదుగా లాంఛనంగా శంకుస్థాపన చేయించనున్నారు. బాయిలర్ కాంట్రాక్టు పొందిన బీహెచ్ఈఎల్ సంస్థ గ్రౌండ్ లెవల్, గ్రేడింగ్ పనులను వేగంగా పూర్తి చేసి బాయిలర్లు నెలకొల్పేందుకు అవసరమైన ఫౌండేషన్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. టర్బైన్ కాంట్రాక్టును దక్కించుకున్న ఆల్స్టాం సంస్థ మట్టి పరీక్ష పనులను పూర్తి చేసి పవర్‌హౌస్ స్థలాన్ని చదును చేసి స్ట్రక్చర్ల నిర్మాణానికి సిద్ధం చేసింది. దీనికి ఇప్పటికే రూ.10,500 కోట్లు మంజూరయ్యాయి. బాయిలర్, టర్బైన్ పనులు నడుస్తుండగా, మిగతా సివిల్ పనులకు సంబంధించి బీహెచ్ఈఎల్, ఆల్స్టాం సంస్థలు సబ్‌కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాయి. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 42 నెలల సమయం పడుతుంది. రెండో దశలో మిగతా 800 మెగావాట్ల 3 యూనిట్లను (2400 మెగావాట్లు) ప్రస్తుత కొత్త ప్లాంట్ ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు ఎన్టీపీసీ కార్పొరేట్ ఇంజనీరింగ్ విభాగం నిర్ణయం తీసుకున్నది. -
కుదిరిన ముహూర్తం
ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–1 ప్లాంట్లకు ముహూర్తం ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లలో నిమగ్నమైన యాజమాన్యాలు గోదావరిఖని : ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పారిశ్రామిక ప్రాంత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని ఈ ప్రాంతానికి వస్తారని స్వయంగా కేంద్రమంత్రులే ప్రకటించినప్పటికీ ఆయన పర్యటన రదై్దంది. తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర పర్యటనకు రావాలని కోరడంతో ప్రధాని అంగీకరించారు. ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్న క్రమంలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–1 ప్లాంట్, ఆర్ఎఫ్సీఎల్ గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మూసివేసిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా పునర్నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అంతర్గత పనులు మార్చి 25న (జీరో డేట్) ప్రారంభమయ్యాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించే క్రమంలో రామగుండంలో తెలంగాణ స్టేజ్–1 కింద 800 మెగావాట్ల రెండు యూనిట్లను నెలకొల్పుతోంది. ఈ పనులు జనవరి 29న (జీరో డేట్) అంతర్గతంగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 7న లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో మూడు హెలీక్యాప్టర్లు ల్యాండ్ అయ్యేవిధంగా హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. పక్కనే గల స్టేడియంలో బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో మహర్దశ గతంలో రామగుండం పారిశ్రామికాభివృద్ధికి ఎరువుల కర్మాగారం కీలకంగా నిలిచింది. అన్నపూర్ణ పేరుతో ఎరువులను తెలంగాణ ప్రాంతానికి అందించింది. అయితే నిర్వహణ లోపాలు, అప్పుల కారణంగా ఈ కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో 1999 మార్చి 31న ఉత్పత్తిని నిలిపివేశారు. బీఐఎఫ్ఆర్కు వెళ్లిన ఈ కంపెనీ రూ.10 వేల కోట్ల అప్పులను మాఫీ చేయడంతో చాలాకాలం తర్వాత అందులో నుంచి బయటపడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా పునర్నిర్మించడానికి నిర్ణయించింది. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్లో రూ.5,700 కోట్ల అంచనా వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. 3,850 మెట్రిక్ టన్నులు అమోనియా, 2,200 మెట్రిక్ టన్నుల యూరియా ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఈనెల 8న గుజరాత్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం జరిగింది. కాకినాడ నుంచి మల్లవరం వరకు వేసే పైపులైన్ నుంచి గ్యాస్‌ను తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారం ఆవరణలోని పాత యంత్రాలు, విభాగాలను పూర్తిగా తొలగించి నేలను చదును చేశారు. యూరియా ప్రిల్లింగ్ టవర్, యూరియాను నిల్వ ఉంచే సైలో మినహా అన్నింటిని తొలగించారు. ఇందులో 500 మంది శాశ్వత ఉద్యోగులు, మరో వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి లభించనుంది. రెండు ప్లాంట్లు... 1600 మెగావాట్లు తెలంగాణ స్టేజ్–1 మొదటి దశలో 800 మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. బాయిలర్ కాంట్రాక్టు పొందిన బీహెచ్ఈఎల్ సంస్థ గ్రౌండ్ లెవల్, గ్రేడింగ్ పనులను పూర్తి చేసి బాయిలర్లు నెలకొల్పేందుకు ఫౌండేషన్‌ను సిద్ధం చేసింది. టర్బైన్ కాంట్రాక్టును దక్కించుకున్న ఆల్స్టాం సంస్థ మట్టి పరీక్ష పనులను పూర్తి చేసి పవర్‌హౌస్ స్థలాన్ని చదును చేసి స్ట్రక్చర్ల నిర్మాణానికి సిద్ధం చేసింది. అలాగే పవర్‌హౌస్, బాయిలర్లు, కూలింగ్ టవర్లు, స్విచ్యార్డుతోపాటు 275 మీటర్ల చిమ్నీని నిర్మిస్తారు. తెలంగాణ ఫేస్–1 కోసం ఇప్పటికే రూ.10,500 కోట్లు మంజూరయ్యాయి. బాయిలర్, టర్బైన్ పనులు నడుస్తుండగా, మిగతా సివిల్ పనులను బీహెచ్ఈఎల్, ఆల్స్టాం సంస్థలు సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించాయి. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 42 నెలల సమయం పడుతుంది. ఫేస్–2లో 800 మెగావాట్ల 3 యూనిట్లను ప్రస్తుత కొత్త ప్లాంట్ ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు కార్పొరేట్ ఇంజనీరింగ్ విభాగం నిర్ణయించింది. ఈ మూడు యూనిట్లకు అనుసంధానంగా ఉండే మెయిన్ ప్లాంటులోని బాయిలర్, టర్బైన్ తదితర విభాగాలను ఫేస్–1 పరిసరాలలోనే ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుండడంతో పనులు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు. -
ప్రధానమంత్రి బీమాయోజన చెక్కు అందజేత
మల్యాల: మల్యాల మండలంలోని మ్యాడంపల్లికి చెందిన అల్లె మల్లయ్య ప్రమాద వశాత్తు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి, తహపీల్దార్ శ్రీహరిరెడ్డి రూ. 2లక్షల చెక్కును అందజేశారు. మల్లయ్య తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ. 12 బీమా చెల్లించాడు. ఈ ఏడాది జనవరిలో మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, బీమా మొత్తం రూ. 2లక్షల అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఖాతాదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ. 12 వందలు ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం కింద రూ. 330 చెల్లించాలని అన్నారు. బీమాతో ఖాతాదారుడి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, ఖాతాదారులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి, తహసీల్దార్ శ్రీహరిరెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజేంద్రప్రసాద్, సీహెచ్.గోపాల్ పాల్గొన్నారు.