
సాక్షి, న్యూఢిల్లీ : గురు గోవింద్ సింగ్ జయంతోత్సవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ గురు నానక్ దేవ్ 550వ జయంతోత్సవాల నేపథ్యంలో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా సిక్కు సోదరులు పాకిస్తాన్‌లోని నరోవల్ దర్బార్ సాహిబ్‌కు వీసా లేకుండా ప్రయాణించవచ్చని చెప్పారు.
సిక్కుల ఆరాధ్యదైవం కొలువైన ప్రాంతం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 1947 దేశ విభజనలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడం పెద్ద తప్పిదమన్నారు. దీన్ని మనం పొందలేకపోయినా కర్తార్‌పూర్ కారిడార్ ఆ బాధను కొంతమేర తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, కార్యక్రమానికి ముందు జయంతోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ గురుగోవింద్ సింగ్‌కు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment