
ప్రతీకాత్మక చిత్రం
మైసూరు (కర్ణాటక): ఫోన్ కాల్స్ గొడవ యువకుని ప్రాణాలు తీసింది. నగరంలోని యరగనహళ్ళిలో ఉండే ప్రజ్వల్ (19) ఒక హోటల్‌లో పని చేసేవాడు. ఒక మహిళకు పదేపదే ఫోన్లు చేస్తుండేవాడు. దీంతో ఆమె భర్త, మరికొందరు కలిసి ప్రజ్వల్ ఇంటికెళ్లి గొడవ చేశారు. మళ్లీ హోటల్‌కు వచ్చి ప్రజ్వల్‌ను నిలదీసి అతని లాక్కెళ్లసాగారు. దాంతో భయపడి ప్రజ్వల్ హోటల్ భవనంపైకి పరిగెత్తి కిందికి దూకడంతో మృత్యువాత పడ్డాడు. దేవరాజ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేశారు.