అపరిచిత ఫోన్ కాల్స్‌తో పోలీసుల అప్రమత్తం | police alerts over railway station fake bomb calls | Sakshi
Sakshi News home page

అపరిచిత ఫోన్ కాల్స్‌తో పోలీసుల అప్రమత్తం

Published Sat, May 3 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

అపరిచిత ఫోన్ కాల్స్‌తో పోలీసుల అప్రమత్తం

అపరిచిత ఫోన్ కాల్స్‌తో పోలీసుల అప్రమత్తం

* అపరిచిత ఫోన్ కాల్స్‌తో పోలీసుల అప్రమత్తం
* పలు ప్రాంతాల్లో తనిఖీలు

బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్ల షాక్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే నగరవాసులు శుక్రవారం మరోసారి బెంబేలెత్తిపోయారు. నగరం, శివార్లలోని పలు ప్రాంతాల్లో అమర్చిన బాంబులు పేలనున్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌లకు వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసులను పరుగులు పెట్టించాయి. బాంబులేవీ దొరక్కపోవడంతో ప్రజలు, పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాఠశాలలు, కాలేజీలు, షాపింగ్‌మాళ్లు, రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టామని, అవి మరికొద్ది సేపట్లో పేలనున్నాయని వివిధ పోలీస్ స్టేషన్ కంట్రోలు రూములకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వరుసగా అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆవడి పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టినట్లు గురువారం రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆవడి, అన్నానగర్, తిరుములైవాయిల్ తదితర లోకల్ రైల్వే స్టేషన్లను శుక్రవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేశారు.
 
ఎగ్మూరు మరో సమాచారంతో అక్కడా తనిఖీలు చేశారు. ‘‘రాయపేటలోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో భారీ బాంబును అమర్చాం అది మరికొద్దిసేపట్లో పేలుతుంది, చాతనైతే ఆపుకోండి.’’ అంటూ సవాల్ విసురుతూ శుక్రవారం ఉదయం పోలీసులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో పెట్టిన బాంబులు వెతికేందుకు పోలీసులు వచ్చారని తెలుసుకున్న వినియోగదారులు, షాపుల యజమానులు వెలుపలకు పరుగులు పెట్టారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే అవెన్యూ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది.

సుమారు మూడు గంటల పాటూ అణువణువునా గాలించిన పోలీసులు ఏమీ లేదని నిర్ధారించుకున్నారు. ఈలోగా టీనగర్‌లోని ఎస్‌ఎస్‌ఎస్ జైన్ మహిళా కళాశాలలో బాంబులు అమర్చినట్లు మరో ఫోన్ కాల్ వచ్చింది. పోలీసు బృందాలు అక్కడ కూడా తనిఖీలు చేసి ఒట్టి బెదిరింపేనని ఊపిరి పీల్చుకున్నారు. తిరువికనగర్‌లోని ఒక పబ్లిక్ బూత్ నుంరి ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేశారా లేక ఆకతాయి చేష్టలా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. మరో సమాచారంతో అక్కడా తనిఖీలు చేశారు. ‘‘రాయపేటలో ని ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో భారీ బాంబును అమర్చాం అది మరికొద్దిసేపట్లో పేలుతుంది, చాతనైతే ఆపుకోండి.’’ అంటూ సవాల్ విసురుతూ శుక్రవారం ఉదయం పోలీసులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో పెట్టిన బాంబులు వెతికేందుకు పోలీసులు వచ్చారని తెలుసుకున్న వినియోగదారులు, షాపుల యజమానులు వెలుపలకు పరుగులు పెట్టారు.
 
నిత్యం అత్యంత రద్దీగా ఉండే అవెన్యూ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. సుమారు మూడు గంటల పాటూ అణువణువునా గాలించిన పోలీసులు ఏమీ లేదని నిర్ధారించుకున్నారు. ఈలోగా టీనగర్‌లోని ఎస్‌ఎస్‌ఎస్ జైన్ మహిళా కళాశాలలో బాంబులు అమర్చినట్లు మరో ఫోన్ కాల్ వచ్చింది. పోలీసు బృందాలు అక్కడ కూడా తనిఖీలు చేసి ఒట్టి బెదిరింపేనని ఊపిరి పీల్చుకున్నారు. తిరువికనగర్‌లోని ఒక పబ్లిక్ బూత్ నుంరి ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేశారా లేక ఆకతాయి చేష్టలా అని పోలీసులు ఆరాతీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement