వాషింగ్టన్: వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీసాపై అంక్షలు విధిస్తూ వస్తున్న ట్రంప్ సర్కార్ మరోసారి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చేలా మరికొన్ని నిబంధనలను చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా అభ్యర్థులు గతంలో వాడిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ మొత్తం వివరాలను కోరుతోంది. అంతేకాదు గత అయిదు సంవత్సరాలుగా సోషల్ మీడియా ఖాతాల హిస్టరీ కూడా కావాలని కోరుతోంది. ఈ నిబంధనలకు సంబంధించిన డాక్యుమెంట్‌ని శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరింది. ఇందుకు 60 రోజుల సమయం కేటాయించింది. వీసా జారీ పక్రియలో కొత్త నిబంధనలను చేర్చడం ప్రజల నుంచి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంది.
ఈ నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఐదు సంవత్సారాల నుంచి వాడిన ఫోన్ నంబర్లు, ఈ మెయిల్, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు కల్గించే వారు దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఇంతకు ముందు ఏయో దేశాలకు ప్రయాణించారు, ప్రయాణిస్తే ఆ దేశం మీపై నిషేధం విధించటం కానీ, బహిష్కరించం గానీ జరిగిందా, దరఖాస్తులో పేర్కొన్న మీ కుటుంబ సభ్యుల ఏవరికైనా ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయనే ప్రశ్నలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. నూతన విధానం అమల్లోకి వస్తే 7లక్షల పదివేలమంది ఇమిగ్రేంట్స్‌పై, కోటి 40 లక్షల నాన్ ఇమిగ్రెంట్స్‌పై ఇది ప్రభావం చూపే ఆవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment