Non Immigrant Visa
-
వీసా ఫీజులు పెంచిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 తదితర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్–1బీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. -
అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్!
వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. మినహాయింపు సమయాన్ని డిసెంబర్ 31, 2023కు పొడిగిస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. తొలిసారి లేదంటే ఇప్పటికే వీసా ఉండి.. ఆ వీసాను రెన్యూవల్ చేసుకునే వారికి ఇది వస్తున్నట్లు స్పష్టం చేసింది. విదేశాంగ విధాన వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ విభాగం కీలక ప్రకటన చేసింది. విదేశాలకు చెందిన విద్యార్ధులు, వర్క్ వీసా హోల్డర్లు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఇంటర్వ్యూలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు వలసేతర వీసాల కోసం వేచి ఉండే సమయం మరింత తగ్గించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఎవరికి వర్తిస్తుందంటే టెంపరరీ అగ్రకల్చర్, నాన్ అగ్రికల్చరల్ వర్కర్స్ (హెచ్-2 వీసా), స్టూడెంట్ (ఎఫ్ అండ్ ఎం వీసా), అకడమిక్ ఎక్ఛేంజ్ విజిటర్స్ (అకడమిక్ జే వీసా) లబ్ధిదారులకు వర్తిస్తుంది. వీరితో పాటు ప్రత్యేకంగా తాత్కాలిక వర్కింగ్ వీసా పొందిన నాన్- ఇమిగ్రెంట్స్(హెచ్-1బీ వీసా), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యూకేషన్ విజిటర్స్ (హెచ్-3 వీసా), ట్రాన్స్ ఫర్ మీద ఇతర దేశం నుంచి అమెరికాకు వెళ్లే(ఎల్ వీసా), సైన్స్, ఎడ్యుకేషన్,ఆర్ట్స్, అథ్లెట్స్, మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ఇండస్ట్రీ విభాగాల్లో అసాధారణమైన ప్రతిభ, విజయాలు సాధించిన (ఓ వీసా), అథ్లెట్స్, ఎంటర్టైన్(పీ వీసా), అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు (క్యూ వీసా) నిర్వహించే వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు అమెరికా తెలిపింది. చదవండి👉 అదిరిపోయేలా జియో న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్..బెనిఫిట్స్ ఎక్కువే! -
ఆ మొత్తం హిస్టరీ ఇస్తేనే వీసా!
వాషింగ్టన్: వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీసాపై అంక్షలు విధిస్తూ వస్తున్న ట్రంప్ సర్కార్ మరోసారి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చేలా మరికొన్ని నిబంధనలను చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా అభ్యర్థులు గతంలో వాడిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ మొత్తం వివరాలను కోరుతోంది. అంతేకాదు గత అయిదు సంవత్సరాలుగా సోషల్ మీడియా ఖాతాల హిస్టరీ కూడా కావాలని కోరుతోంది. ఈ నిబంధనలకు సంబంధించిన డాక్యుమెంట్‌ని శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేసింది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరింది. ఇందుకు 60 రోజుల సమయం కేటాయించింది. వీసా జారీ పక్రియలో కొత్త నిబంధనలను చేర్చడం ప్రజల నుంచి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంది. ఈ నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఐదు సంవత్సారాల నుంచి వాడిన ఫోన్ నంబర్లు, ఈ మెయిల్, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు కల్గించే వారు దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఇంతకు ముందు ఏయో దేశాలకు ప్రయాణించారు, ప్రయాణిస్తే ఆ దేశం మీపై నిషేధం విధించటం కానీ, బహిష్కరించం గానీ జరిగిందా, దరఖాస్తులో పేర్కొన్న మీ కుటుంబ సభ్యుల ఏవరికైనా ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయనే ప్రశ్నలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. నూతన విధానం అమల్లోకి వస్తే 7లక్షల పదివేలమంది ఇమిగ్రేంట్స్పై, కోటి 40 లక్షల నాన్ ఇమిగ్రెంట్స్పై ఇది ప్రభావం చూపే ఆవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
భారత్‌కు పెరిగిన యూఎస్ వీసాలు
పాక్‌కు భారీ కోత ఇస్లామాబాద్: ట్రంప్ ప్రభుత్వం వచ్చాక భారత్‌కు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ పెరిగింది. తాజాగా విడుదల చేసిన అధికారిక సమాచారంలో.. భారత జాతీయులకు వీసాల్లో 28 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు అమెరికా విధించిన ట్రావెల్ బ్యాన్ దేశాల్లో పాకిస్తాన్ లేకపోయినా ఆ దేశీయులకు వీసాల్లో మాత్రం భారీ కోత పెట్టారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌లతో పోలిస్తే ఈ ఏడాది అవే నెలల్లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల్లో పాక్ జాతీయులకు 40 శాతం తగ్గించారు. ఈ వివరాలను పాక్ మీడియా సోమవారం వెల్లడించింది. గతేడాది ఒబామా పాలనలో పాక్ జాతీయులకు 78,637 వీసాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నెలకు సరాసరి 6,553 వీసాలు. అయితే ఈ ఏడాది మార్చిలో 3,973, ఏప్రిల్‌లో 3,925 వీసాలు జారీ చేశారు. ఇక భారతీయులకు ఒబామా సర్కార్ గతేడాది 8,64,987 వీసాలు జారీచేసింది. ఆ ఏడాదిలో సరాసరి నెలకు 72,082 వీసాలు. కాగా, ఈ ఏడాది మార్చిలో భారత జాతీయులకు 87,049, ఏప్రిల్‌లో 97,925 వీసాలు ట్రంప్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే మొత్తంగా చూస్తే పాకిస్తానే కాకుండా ముస్లిం దేశాలకు వీసాల జారీల్లో అమెరికా భారీ కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో 20 శాతం వీసాలు తగ్గించారు. ఇక ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న ఇరాన్, సిరియా, సూడాన్, సోమాలియా, లిబియా, యెమెన్ దేశాలకు జారీ చేసిన వీసాల్లో 55 శాతం తగ్గుదల కనిపిస్తోంది.