వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. మినహాయింపు సమయాన్ని డిసెంబర్ 31, 2023కు పొడిగిస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ వెల‍్లడించింది. తొలిసారి లేదంటే ఇప్పటికే వీసా ఉండి.. ఆ వీసాను రెన్యూవల్ చేసుకునే వారికి ఇది వస్తున్నట్లు స్పష్టం చేసింది.
విదేశాంగ విధాన వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ విభాగం కీలక ప్రకటన చేసింది. విదేశాలకు చెందిన విద్యార్ధులు, వర్క్ వీసా హోల్డర్లు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఇంటర్వ్యూలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు వలసేతర వీసాల కోసం వేచి ఉండే సమయం మరింత తగ్గించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది.
ఎవరికి వర్తిస్తుందంటే
టెంపరరీ అగ్రకల్చర్, నాన్ అగ్రికల్చరల్ వర్కర్స్ (హెచ్-2 వీసా), స్టూడెంట్ (ఎఫ్ అండ్ ఎం వీసా), అకడమిక్ ఎక్ఛేంజ్ విజిటర్స్ (అకడమిక్ జే వీసా) లబ్ధిదారులకు వర్తిస్తుంది. వీరితో పాటు ప్రత్యేకంగా తాత్కాలిక వర్కింగ్ వీసా పొందిన నాన్- ఇమిగ్రెంట్స్(హెచ్-1బీ వీసా), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యూకేషన్ విజిటర్స్ (హెచ్-3 వీసా), ట్రాన్స్ ఫర్ మీద ఇతర దేశం నుంచి అమెరికాకు వెళ్లే(ఎల్ వీసా), సైన్స్, ఎడ్యుకేషన్,ఆర్ట్స్, అథ్లెట్స్, మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ఇండస్ట్రీ విభాగాల్లో అసాధారణమైన ప్రతిభ, విజయాలు సాధించిన (ఓ వీసా), అథ్లెట్స్, ఎంటర్‌టైన్(పీ వీసా), అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు (క్యూ వీసా) నిర్వహించే వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు అమెరికా తెలిపింది.
చదవండి👉 అదిరిపోయేలా జియో న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్..బెనిఫిట్స్ ఎక్కువే!
Comments
Please login to add a commentAdd a comment