ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ నంబర్ అనేది చాలా ముఖ్యమైనది. ఒక సారి నంబర్ ఎంచుకుంటే అది కొన్నేళ్ల పాటు ఉంటుంది. అంతటి కీలకమైన ఫోన్ నంబర్‌ను వినియోగదారులు తమకు నచ్చినట్లుగా ఎంచుకునే అద్భుతమైన ఫీచర్‌ను రిలయన్స్ జియో అందిస్తుందని మీకు తెలుసా..?
“జియో చాయిస్ నంబర్” గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇది మీ అదృష్ట సంఖ్యలు, పుట్టిన తేదీ లేదా మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వాటిని ప్రతిబింబించేలా మీ ఫోన్ నంబర్‌ను ఎంచుకోవడానికి అనుమతించే ప్రత్యేకమైన ఆఫర్. జియో చాయిస్ నంబర్ ద్వారా “జియోప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్”కి సబ్‌స్క్రయిబ్ చేసినప్పుడు మీకు నచ్చిన మొబైల్ నంబర్ సిరీస్‌ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లు ఒక వ్యక్తికి రూ. 349 నుంచి, ఫ్యామిలీ ప్లాన్‌కు రూ. 449 నుంచి ప్రారంభమవుతాయి.
మీ జియో ఛాయిస్ నంబర్ పొందండిలా..
జియో ఛాయిస్ నంబర్‌ను పొందడం సులభమైన ప్రక్రియ. మీరు దీన్ని మై జియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా ఎంచుకోవచ్చు.
MyJio యాప్ ద్వారా..
» MyJio యాప్‌ని తెరవండి. ఒకవేళ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఉండకపోతే, యాప్ స్టోర్ నుంచి MyJio యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
» మెను విభాగంపై క్లిక్ చేసి నచ్చిన నంబర్‌ను ఎంచుకోండి.
» ‘Let’s book now’పై నొక్కి మీ పేరు, పిన్ కోడ్, మీ నచ్చిన అంకెలను (4-5 అంకెల వరకు) నమోదు చేయండి.
» మీ ప్రమాణాలకు సరిపోయే సంఖ్యల జాబితాను జియో మీకు చూపుతుంది. వీటిలో బాగా నచ్చినదాన్ని ఎంచుకోండి.
» ప్లాన్ రుసుము రూ. 499 చెల్లించి బుకింగ్‌ను పూర్తి చేయండి. అదనపు ఖర్చు లేకుండానే నంబర్ మీకు డెలివరీ అవుతుంది.
Jio.com వెబ్‌సైట్ ద్వారా..
» అధికారిక జియో వెబ్‌సైట్‌కి వెళ్లండి.
» మీ ప్రస్తుత జియో నంబర్‌ను నమోదు చేసి దానిని ఓటీపీతో ధ్రువీకరించండి.
» మీ పేరు, పిన్ కోడ్, ప్రాధాన్య అంకెలను జోడించి, ఆపై ‘Show available numbers’ పై క్లిక్ చేయండి.
» అందుబాటులో ఉన్న నంబర్‌ల జాబితా నుంచి ఎంచుకుని, 'ప్రొసీడ్'పై క్లిక్ చేసి, చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి.
Comments
Please login to add a commentAdd a comment