హైదరాబాద్ : నకిలీ ఆధార్ కార్డులను తయారుచేస్తున్న ఓ ముఠా గుట్టును గోల్కొండ పోలీసులు గురువారం సాయంత్రం రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ షేక్‌పేట ఓయూ కాలనీలోని ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి ప్రింటర్లు, ల్యాప్‌టాప్, స్కానర్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఆధార్ డిప్యూటీ డెరైక్టర్ అనిత, షేక్‌పేట తహశీల్దార్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.