హీరోయిన్‌ నకిలీ ఆధార్‌తో రూమ్‌ బుకింగ్‌ | Room Booked In The Name Of Rautela By Fake Aadhaar Card | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 1:25 PM | Last Updated on Thu, Jul 26 2018 2:06 PM

Room Booked In The Name Of Rautela By Fake Aadhaar Card - Sakshi

హీరోయిన్‌ ఊర్వశి రౌతెలా

ముంబై : బాలీవుడ్ హీరోయిన్‌ పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించి ఐదు నక్షత్రాల హోటల్లో గదిని బుక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సబర్బన్‌ బాంద్రాలోని ప్లష్‌ హోటల్‌లో జరిగింది ఈ సంఘటన. ‘కాబిల్’, ‘హేట్‌ స్టోరీ 4’ ఫేం ఊర్వశి రౌతెలా ఒక కార్యక్రమానికి హాజరవడం కోసం ప్లష్‌ హోటల్‌కు వచ్చింది. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా హోటల్‌ సిబ్బంది వచ్చి మీ పేరుతో గది బుక్‌ చేశారని చెప్పారు. రౌతెలా తన సెక్రటరీని పిలిచి అడగ్గా తాను ఏ గది బుక్‌ చేయలేదన్నాడు.

ఆమె వెంటనే హోటల్‌లోని బుకింగ్‌ రికార్డును పరిశీలించగా తన పేరుతో ఉన్న నకిలీ ఆధార్‌కార్డు సాయంతో ఎవరో గదిని బుక్‌ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం గురించి ఆమె బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 468 (ఫోర్జరీ), ఐటీ ఆక్ట్‌ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి ఆన్‌లైన్‌లో రౌతెలా పేరుతో ఉన్ననకిలీ ఆధార్‌కార్డుతో హోటల్‌ గదిని బుక్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement