additions
-
ఆధార్.. అప్‘లేట్’
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు అప్డేట్కు ‘తిరస్కరణ’తిప్పలు తప్పడం లేదు. ఒకటి రెండుసార్లు చేర్పులుమార్పులు చేసుకుంటే ఆ తర్వాత ఆప్డేషన్ ప్రక్రియ తిరస్కరణకు గురవుతోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి పరుగులు తీసి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆధార్‌కార్డులో అప్డేషన్ సమస్యగా తయారైంది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకోవడంతో ఆ తర్వాత బయోమెట్రిక్ గుర్తింపు సమస్యగా మారింది. మరోవైపు చిన్నచిన్న తప్పిదాలు సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నదానికి కూడా హైదరాబాద్‌కు తరలిరావడం పేదలకు భారంగా మారుతోంది. ఏదీ..ఎలా మార్చుకోవచ్చు అంటే... ఆధార్‌కార్డు అనేది గుర్తింపును చూపే ముఖ్యమైన సాధనంగా మారింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధా ర్కార్డులో చేర్పులు మార్పులపై కొన్ని నిబంధనలు విధించింది. ఆధార్ కార్డులో ఓ వ్యక్తి తన పేరు, జన్మదినం, జెండర్ వంటి వాటిని మార్చుకోవడం అప్డేట్ చేసుకునేందుకు పరిమితి విధించింది. ► యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డులో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటి పేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ► ఆధార్ కార్డులో డేట్ఆఫ్బర్త్ కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. దీనికీ కొన్ని షరతులు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ సమయంలో ఇచి్చన తేదీకి కేవలం మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. డేట్ మార్చుకోవాలనుకునే వారు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆధారాలు సమరి్పంచాలి. ► ఆధార్ కార్డులో జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ► ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ నమోదు కేంద్రంలో ఫొటో అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మార్చుకోవడం కుదరదు. ► అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాలి. ప్రాంతీయ కార్యాలయంలోనే ఆధార్‌కార్డులో పేరు, పుట్టిన తేదీ వివరాలు, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చేందుకు వీల్లేదు. పరిమితి దాటిన తర్వాత ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇందుకు ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యూఆర్ఎన్ స్లిప్, ఆధార్ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా స్పష్టంగా వివరించాలి. జూన్ 14 వరకు ఉచిత అప్డేట్కు అవకాశం పదేళ్లు దాటిన ఆధార్‌కార్డుల అప్డేట్ తప్పనిసరి. ఆధార్ జారీ తర్వాత చాలామంది అప్డేట్ చేసుకోలేదు. వీరి కోసం యూఐడీఏఐ ఉచితంగానే..ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం కలి్పంచింది. కొంతకాలంగా గడువు పొడిగిస్తూ వస్తోంది. ఈసారి జూన్ 14 వరకూ ఆన్లైన్లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. చిరునామా, పేర్లలో అక్షర దోషాలు సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమరి్పంచి ఆప్డేట్ చేసుకోవాలి. అప్డేట్కు ప్రయత్నిస్తే తిరస్కరించి రద్దు చేశారు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాను. దరఖాస్తు నింపి ఇవ్వగా అప్లోడ్ చేశారు. కొద్ది రోజులకు రిజెక్ట్ అయ్యిందనే మెసేజ్ వచి్చంది. మళ్లీ దరఖాస్తు చేయగా ఆధార్ రద్దు అయ్యిందని చెప్పారు. హైదరాబాద్‌లోని రీజనల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ చెక్ చేసి కొత్త కార్డు జారీ చేస్తామని చెప్పి దరఖాస్తు తీసుకున్నారు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. – అక్షర, స్టూడెంట్, కామారెడ్డి జిల్లా నెలరోజుల నుంచి తిరుగుతున్నా... ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. సరిచేసుకునేందుకు రీజినల్ కార్యాలయం చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నా. సరైన పత్రాలు సమర్పించి అప్లోడ్ చేయించినా కార్డు రాలేదు. – సాయికుమార్, వికారాబాద్ జిల్లా పేరు మారడం లేదు ఆధార్ కార్డులో పేరు మార్చుకునేందుకు రెండు నెలల నుంచి రీజినల్ కార్యాలయానికి తిరుగుతున్నాను. వచి్చన ప్రతిసారి కావాల్సిన పత్రాలు సమరి్పంచినా కార్డులో పేరు మాత్రం మారడం లేదు. – బాషా, కర్నూలు -
AP: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు
సాక్షి, అమరావతి: మా అబ్బాయికి ఉద్యోగం ఉందనో లేదంటే ఇన్‌కం టాక్స్ కడుతున్నారనో మాకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు.. ఈ తరహా కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న వారికి ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ప్రాతిపదికగా తీసుకుంటున్న నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల డేటాలో మార్పులు, చేర్పులకు వీలు కల్పించింది. ఆ సర్వే డేటాలో.. పెళ్లైన రెండు మూడు జంటలు కూడా ఒకే కుటుంబంగా నమోదై ఉండి.. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివాసముంటుంటే.. వారిని వేర్వేరు కుటుంబాలుగా వర్గీకరించేందుకు అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందొచ్చని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు వెల్లడించారు. ఆ కారణంతో ప్రభుత్వ పథకాలకు పలువురు దూరం ప్రభుత్వం 2019 ఆగస్టులో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాక.. వలంటీర్ల ఆధ్వర్యంలో నవశకం సర్వే నిర్వహించింది. వలంటీర్లు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి, ఆ ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ కుటుంబ వివరాలను నమోదు చేశారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.67 కోట్ల కుటుంబాలున్నట్టు ఆ సర్వే తేల్చింది. నవశకం పేరుతో జరిగిన ఆ సర్వే వివరాల డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల వివరాలను ఆ నవశకం డేటాలో పేర్కొన్న కుటుంబాల వారీగా సభ్యుల వివరాలతో అధికారులు పోల్చి చూస్తున్నారు. అయితే, అప్పట్లో ఒకే కుటుంబంగా తమ వివరాలను నమోదు చేసుకున్న వారు పలు చోట్ల ఇబ్బంది పడుతున్నారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారనో, లేదంటే ఇన్‌కం ట్యాక్స్ కడుతున్నారనో, లేదా కారు ఉందనో, లేదంటే వ్యక్తిగత పేరుతో ఎక్కువ ఆస్తి నమోదై ఉందనో.. ఇలా పలు కారణాల వల్ల ఆ కుటుంబంలోని మిగతా వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. దీంతో కుటుంబ సభ్యుల వివరాల విభజనకు అవకాశం కలి్పంచాలని వారు ప్రభుత్వానికి అర్జీలిస్తూ వస్తున్నారు. ఇలాంటి వినతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వం నవశకం సర్వే డేటాలో కుటుంబ వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. ఆ ఆరింటిలో ఏదో ఒక ఆధారం తప్పనిసరి.. నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోదలచిన వారు ఆరు రకాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. సర్వే డేటాలో.. ఇప్పుడు ఒకే కుటుంబంగా పేర్కొంటున్న వారిలో పెళ్లై వేరుగా ఉంటున్న వారు.. వివాహ ధ్రువీకరణ పత్రం, లేదంటే ఆధార్, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీకార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, పాస్‌పోర్టుల్లో భర్త లేదా భార్య పేర్లు ధ్రువీకరించేలా ఉంటే.. ఆ కుటుంబ సభ్యులను మరో కుటుంబంగా గుర్తిస్తారు. అయితే, ఆయా ధ్రువీకరణ పత్రాలుండటంతో పాటు ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేరుగా నివాసం ఉండాలి. చదవండి: మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు ప్రయోగాత్మక పరిశీలన అనంతరం.. నవశకం సర్వే డేటాలో కుటుంబ సభ్యుల వర్గీకరణను ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఒక మండలంలో, పట్టణ ప్రాంతంలో ఒక నగర కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకం(పైలెట్)గా పరిశీలన పూర్తి చేశారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం, వైఎస్సార్ జిల్లా కడప నగర కార్పొరేషన్‌ను ఇందుకు ఎంపిక చేశారు. మొదటి దశలో.. పెళ్లైన వారి వివరాల ప్రకారం మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. మరో రెండు దశల్లో వితంతు, విడాకులు తీసుకున్న వారిని వేరే కుటుంబాలుగా గుర్తించే ప్రక్రియ కూడా ఈ రెండు ప్రాంతాల్లో శుక్రవారం నుంచే ప్రయోగాత్మకంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
బిగ్‌బాస్ షోలో ఇప్పుడు మీరు కూడా ఆడొచ్చు..
సాక్షి, హైదరాబాద్ : గత ఏడాది తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వచ్చిన ఈ షో టీఆర్పీ రేటింగ్లను ఓ స్థాయికి తీసుకెళ్లింది. సెలబ్రిటీల ఆటతీరుతో అనుకున్న దానికంటే సూపర్ హిట్ అయింది. దీంతో నిర్వాహకులు రెండో సీజన్‌కు ప్రణాలికలు వేస్తున్నారు. అయితే ఈ సారి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కార్యక్రమాన్ని మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దడానికి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు, సాధారణ ప్రేక్షకులు సైతం ఇందులో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీజన్2కు ఆడిషన్లు మొదలైనట్లు షో నిర్వాహకులు తెలియచేశారు. ఇందులో సామాన్యులు సైతం పాల్గొనే అవకాశం ఉందని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. గత సీజన్లో వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చిన దీక్షాపంత్ ఉన్న వీడియోలో బిగ్‌బాస్ షోకి సామాన్యులకు స్వాగతం అంటూ ఓ వాయిస్ వినిపిస్తుంది. దానికి కొనసాగింపుగా ఇంకో వీడియోను సైతం నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వీడియోలో ఇంట్లో ఏపని చేయని ఓ యువకుడు ఉదయాన్నే లేచి అన్నిపనులు చేస్తుంటాడు. అది చూసిన కుటుంబ సభ్యులు తనకు ఏమైందంటూ ఆలోచిస్తుంటారు. అదే సమయంలో బిగ్‌బాస్ షోలో సామాన్యులకు అవకాశం అంటూ ఓ ప్రకటన వస్తుంది. అంటే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేయబోతున్నారన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి. -
ఏపీలో అధికారుల మార్పులు-చేర్పులు
హైదరాబాద్: రాష్ట్ర సహకార మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి నైపుణ్య అభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్), పారిశ్రామికవేత్తల రూపకల్పన, వినూత్న(ఇన్నొవేషన్) శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈయన బదిలీతోపాటు మరికొన్ని అదనపు బాధ్యతలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రేమచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు స్కిల్ డెవలప్మెంట్ విభాగం ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు ముఖ్యమంత్రి ఎక్స్అఫిషియో కార్యదర్శి బాధ్యతలు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ అదనంగా సహకార, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల కమిషనర్ చిరంజీవి చౌదరి (ఐఎఫ్ఎస్) ఆ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి బాధ్యతలు. -
ఈ-ప్రజాపంపిణీ
మీ-సేవ ద్వారా రేషన్‌కార్డులో మార్పులు, చేర్పులు విశాఖ రూరల్: పారదర్శకతతో పనిచేసేందుకు కేంద్రం ఈ-ప్రజాపంపిణీ పథకం అమలు చేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పులను మీ-సేవా కేంద్రాల ద్వారా చేసుకునేందుకు ఇక వీలు కలుగుతుంది. ప్రస్తుతమున్న తెలుపు, ఇతర బీపీఎల్ రేషన్‌కార్డులను గులాబీకార్డులుగా మార్చుకునేందుకు, గులాబీ కార్డుల జారీకి, రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుని పేరు తొలగింపు, కుటుంబ యజమాని పేరు మార్పునకు, రేషన్‌కార్డులో మార్పులు చేర్పులు, ఎల్పీ గ్యాస్ స్థితి మార్పులు చేసుకోవాలనుకొనే వారు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే డూప్లికేట్ రేషన్‌కార్డు జారీ, కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు, రేషన్‌డిపో డీలర్ ఆథరైజేషన్ నవీకరణకు, రేషన్‌కార్డు బదిలీకి, రేషన్‌కార్డును అప్పగించడానికి, పుట్టిన పిల్లల, వలస వచ్చిన కుటుంబ సభ్యుల పేర్లు రేషన్‌కార్డులో నమోదుకు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.