ఏపీలో అధికారుల మార్పులు-చేర్పులు | AP officers Changes and additions | Sakshi
Sakshi News home page

ఏపీలో అధికారుల మార్పులు-చేర్పులు

Published Wed, Oct 21 2015 8:11 PM | Last Updated on Sat, Mar 23 2019 9:06 PM

AP officers Changes and additions

హైదరాబాద్: రాష్ట్ర సహకార మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి నైపుణ్య అభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్), పారిశ్రామికవేత్తల రూపకల్పన, వినూత్న(ఇన్నొవేషన్) శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈయన బదిలీతోపాటు మరికొన్ని అదనపు బాధ్యతలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

  • ప్రేమచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు  
  • స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు ముఖ్యమంత్రి ఎక్స్‌అఫిషియో కార్యదర్శి బాధ్యతలు
  • వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ అదనంగా సహకార, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు
  • ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల కమిషనర్ చిరంజీవి చౌదరి (ఐఎఫ్‌ఎస్) ఆ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి బాధ్యతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement