
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ల క్రాష్ కొనసాగుతోంది. స్టాక్ సూచీలు ఈరోజు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 228 పాయింట్ల నష్టంతో 64,922 పాయింట్ల వద్ద.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 19,292 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ప్రభుత్వ రంగ కోల్ ఇండియా, టీసీఎస్, విప్రో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. ఇక టాప్ గెయినర్స్‌గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లార్సెన్, సిప్లా, అదానీ పోర్ట్స్, యూపీఎల్ సంస్థ షేర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: దేశంలోని వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)