
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. స్టాక్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 266 పాయింట్ల లాభంతో 65,700 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 19,523 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, లార్సెన్, టెక్ మహీంద్ర, ఎల్‌టీఐ మైండ్ ట్రీ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఐచర్ మోటర్స్ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)