సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందు క్షమాపణలు చెప్పారు. జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో కలిగిన అంతరాయం గుర్తుంది కదా. అందుకు సంబంధించి సెక్యూరిటీ సేవలందించిన క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ప్రతినిధులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందుకు వచ్చింది. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ క్షమాపణలు కోరారు.
మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘జులైలో జరిగిన సంఘటనకు సైబర్ అటాక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణం కాదు. కొత్త థ్రెట్ డిటెక్షన్ కాన్ఫిగరేషన్‌లను అప్‌డేట్ చేస్తున్నపుడు ఫాల్కన్ సెన్సార్ రూల్స్ ఇంజిన్ తప్పుగా కమ్యూనికేట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ అప్‌డేట్ వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాల్లో సెన్సార్‌లు సరిగా పనిచేయలేదు. తిరిగి కాన్ఫిగరేషన్‌లను అప్‌డేట్ చేసేంతవరకు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి యూఎస్ సైబర్‌సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సబ్‌కమిటీ ముందు విచారణ జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చాం. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!
జులై 19న సంభవించిన ఈ అంతరాయంతో విమానయాన సంస్థలు, బ్యాంకులు, హెల్త్‌కేర్, మీడియా, హాస్పిటాలిటీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ప్రభావితం చెందాయి. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా దాదాపు 85 లక్షల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాలపై దీని ప్రభావం పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దానివల్ల 13 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment