system upgrade
-
‘తప్పు జరిగింది..క్షమించండి’
సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందు క్షమాపణలు చెప్పారు. జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో కలిగిన అంతరాయం గుర్తుంది కదా. అందుకు సంబంధించి సెక్యూరిటీ సేవలందించిన క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ప్రతినిధులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందుకు వచ్చింది. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ క్షమాపణలు కోరారు.మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘జులైలో జరిగిన సంఘటనకు సైబర్ అటాక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణం కాదు. కొత్త థ్రెట్ డిటెక్షన్ కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేస్తున్నపుడు ఫాల్కన్ సెన్సార్ రూల్స్ ఇంజిన్ తప్పుగా కమ్యూనికేట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ అప్డేట్ వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాల్లో సెన్సార్లు సరిగా పనిచేయలేదు. తిరిగి కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేసేంతవరకు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి యూఎస్ సైబర్‌సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సబ్‌కమిటీ ముందు విచారణ జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చాం. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!జులై 19న సంభవించిన ఈ అంతరాయంతో విమానయాన సంస్థలు, బ్యాంకులు, హెల్త్‌కేర్, మీడియా, హాస్పిటాలిటీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ప్రభావితం చెందాయి. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా దాదాపు 85 లక్షల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాలపై దీని ప్రభావం పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దానివల్ల 13 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. -
ఇంటెల్ యూజర్లకు వార్నింగ్
ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కార్ప్ వినియోగదారులను విస్మయానికి గురిచేసే వార్త చెప్పింది. ఇటీవల రిలీజ్ చేసిన సిస్టం అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. తాము విడుదల చేసిన అప్డేటెడ్ పాచెస్‌లో లోపాలు ఉన్నట్టు వెల్లడించింది. తన చిప్‌లో రెండు హై-భద్రతా ప్రమాదాలను పరిష్కరించేందుకు విడుదల చేసిన పాచెస్ ప్రమాదకరమైనవని, కనుక అప్డేట్ చేసుకోవద్దని హెచ్చరించింది. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ వినియోగదారులు, కంప్యూటర్ తయారీదారులు, క్లౌడ్ ప్రొవైడర్లకు కీలక సూచనలు జారీ చేసింది. చిప్ మేకర్ వెబ్సైట్లో ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నవిన్ షెనోయ్ ఈ విషయాన్ని ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెల్ యూజర్లకు క్షమాపణలు చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నామని హామీ ఇచ్చారు. దీనికోసం 24 గంటలుపనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటెల్ వైఫ్యలం కంప్యూటర్ల వ్యాపారంపై ప్రభావం పడనుందని ఐడీసీ ఎనలిస్ట్ మారియో మోరేల్స్ వ్యాఖ్యానించారు. సంబంధిత పాచ్‌ను విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం కొనుగోళ్లపై పడుతుందన్నారు. స్పెక్ట్రే అండ్ మెల్ట్‌డౌన్ అని పిలవబడే ఫాల్టీ పాచెస్ ప్రభావానికిగురైన తన చిప్‌లో లోపాలు ఉన్నాయని ధృవీకరించిన దాదాపు మూడు వారాల తరువాత ఈ హెచ్చరిక చేసింది. అలాగే కొత్త వెర్షన్‌ను పరీక్షించాలని టెక్నాలజీ ప్రొవైడర్లను కోరింది. -
ఎస్ బ్యాంక్ ఇంటర్నెట్ సేవలు 4రోజులు బంద్
ముంబై: ప్రముఖ ప్రయివేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవట. సిస్టం అప్‌గ్రేడేషన్ కారణంగా తమ ఇంటర్నెట్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలగనున్నట్టు సంస్థ తెలిపింది. తమ ఖాతాదారులకు మరింత ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే దిశగా సిస్టంను అప్ గ్రేడ్ చేస్తున్న కారణంగా నాలుగురోజుల పాటు తమ సేవలు అందుబాటులో ఉండవని ఇ-మెయిల్ నోటిఫికేషన్ ద్వారా వినియోగదారులకు బ్యాంకు సమాచారం అందించింది. ఫిబ్రవరి 6 సోమవారం ఉదయం 9గంటల నుంచి ఫిబ్రవరి 13వతేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు తమ సేవలు అందుబాటులో ఉండవని ఎస్ బ్యాంక్ చెప్పింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ చెల్లింపులు (NEFT / RTGS / IMPS), ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎస్ఎస్డి లాంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామనీ, ఖాతాదారుల పూర్తి సహకారాన్ని అభ్యర్థిస్తున్నామని యెస్ బ్యాంక్ ఇ-మెయిల్ నోటిఫికేషన్ లో తెలిపింది.