ఎస్ బ్యాంక్ ఇంటర్నెట్ సేవలు 4రోజులు బంద్
ముంబై: ప్రముఖ ప్రయివేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవట. సిస్టం అప్గ్రేడేషన్ కారణంగా తమ ఇంటర్నెట్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలగనున్నట్టు సంస్థ తెలిపింది. తమ ఖాతాదారులకు మరింత ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే దిశగా సిస్టంను అప్ గ్రేడ్ చేస్తున్న కారణంగా నాలుగురోజుల పాటు తమ సేవలు అందుబాటులో ఉండవని ఇ-మెయిల్ నోటిఫికేషన్ ద్వారా వినియోగదారులకు బ్యాంకు సమాచారం అందించింది.
ఫిబ్రవరి 6 సోమవారం ఉదయం 9గంటల నుంచి ఫిబ్రవరి 13వతేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు తమ సేవలు అందుబాటులో ఉండవని ఎస్ బ్యాంక్ చెప్పింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ చెల్లింపులు (NEFT / RTGS / IMPS), ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎస్ఎస్డి లాంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామనీ, ఖాతాదారుల పూర్తి సహకారాన్ని అభ్యర్థిస్తున్నామని యెస్ బ్యాంక్ ఇ-మెయిల్ నోటిఫికేషన్ లో తెలిపింది.