రకరకాల మోడళ్లతో స్మార్ట్ ఫోన్ బిజినెస్‌లో దూసుకుపోతున్న శాంసంగ్.. త్వరలో విడుదల చేయనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 మడత ఫోన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మడత కీలు(హింజ్) ఇది 2 లక్షల మడతలను తట్టుకోగలదని తెలిసింది.
ప్రస్తుతం ఈ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 వాటర్‌డ్రాప్ హింజ్ డిజైన్ ఆఖరి పరీక్ష జరుపుకోబోతోందని 9టు5గూగుల్ అనే సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ కొత్త ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే ఎంత మడిచినా స్క్రీన్‌పై ఎటువంటి తేడా ఉండదు. అలాగే మడతపెట్టినప్పుడు కూడా గ్యాప్ కనిపించదు. ఇక ఫోన్ కొత్త డిజైన్ మునుపటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4తో పోలిస్తే సన్నగా ఉంటుంది.మ
ఇదీ చదవండి: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా?
త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన మడత కీలు(హింజ్), డిస్‌ప్లే ప్యానెల్ 2 లక్షల నుంచి 3 మడతల వరకు తట్టకునేలా శాంసంగ్ విశ్వసనీయత పరీక్ష నిర్వహిస్తున్నట్లు 9టు5గూగుల్ నివేదిక పేర్కొంది.
శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 5 డ్రాప్లెట్ స్టైల్ హింజ్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ గత జనవరిలో తెలిపింది. అది ఫోన్ డిస్‌ప్లే క్రీజ్‌ను తగ్గిస్తుందని వివరించింది. దీనికి 108 ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, అంతర్నిర్మిత స్టైలస్ పెన్ (ఎస్ పెన్) స్లాట్‌ను కలిగి ఉంటుందని గతంలో పుకారు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment