గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్ చాట్‌జీపీటీ. ప్రపంచ దేశాల్ని వణుకు పుట్టిస్తున్న ఈ చాట్‌జీపీటీని బ్యాన్ చేసే దేశాల సంఖ్యతో పాటు పలు విద్యా సంస్థలు, టెక్ కంపెనీలు చేరిపోయాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ చాట్‌జీపీటీని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగంలోకి రాకుండా అడ్డుకున్న జాబితాలో శాంసంగ్ చేరింది.
చాట్‌జీపీటీని బ్యాన్ చేస్తూనే..
ఏఐ ఆధారిత టూల్‌ను బ్యాన్ చేసినట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఓ మెమోను జారీ చేసింది. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఇంట్రర్నల్‌గా, ఎక్స్‌ట్రర్నల్‌గా వృద్ది చెందుతున్నాయి. వినియోగం, సమర్థత విషయంలో తిరుగు లేదు. కానీ అదే సమయంలో ఏఐ’ వల్ల ప్రమాదాలు అదే స్థాయిలో ఉన్నాయని అందులో పేర్కొంది. అయితే చాట్‌జీపీటీ వినియోగాన్ని నిలిపివేస్తూ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచుతూ ఏఐని సురక్షితంగా వినియోగించేలా..అందుకు కావాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నాం. ఈ చర్యలు సిద్ధమయ్యే వరకు ఏఐ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
డేటా లీక్ చేసిన ఇంజినీర్లు
శాంసంగ్ తమ సెమీ కండక్టర్ విభాగంలో ప్రోగ్రామింగ్ సాయంతో ఏదైనా సమస్యను పరిష్కరించేలా చాట్‌జీపీటీని వినియోగించేలా అనుమతిచ్చింది. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న ఇంజినీర్లు ప్రోగ్రాం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటే.. ఆ సమస్య ఏంటో చాట్ జీపీటికి వివరించి.. ఆ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తారు.
ఈ నేపథ్యంలో ఆ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి కొత్త ప్రోగ్రామ్ గురించి సోర్స్‌కోడ్ కావాలని చాట్‌బాట్‌ను కోరాడు. అందుకు శాంసంగ్ సెమీకండక్టర్‌కు సంబంధించిన అత్యంత సున్నితమైన డేటాను చాట్‌జీపీటీకి షేర్ చేశాడు. అంతేకాదు సంస్థ అంతర్గతంగా హార్డ్‌వేర్ విభాగంపై తయారు చేసిన నోట్స్‌ను సైతం చాట్‌జీపీటీకి అందించాడు. ఇలాంటి పొరపాట్లు నెల రోజుల్లో మూడు సార్లు జరగడంతో శాంసంగ్ దిద్దు బాటు చర్యలకు ఉపక్రమించింది. చాట్‌జీపీటీ తరహాలాంటి టూల్స్ వినియోగించబోమని స్పష్టం చేసింది.
ఏఐ చాలా ప్రమాదం
తాజాగా, ఏఐ ప్రభావంపై ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన జెఫ్రీ హింటన్ వార్నింగ్ ఇచ్చారు. గూగుల్‌లో పని చేసే సమయంలో ఏఐపై మాట్లాడడం సరికాదని, వయసు రిత్యా సంస్థలో పనిచేయడం సమంజసం కాదన్నారు. కాబట్టే గూగుల్‌ను బయటకు వచ్చేశారు. అనంతరం ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ (ఏఐ) టెక్నాలజీ భవిష్యత్‌లో మరింత ప్రమాద కరంగా మారనుందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు గూగుల్‌ని ఎలా ప్రభావితం చేస్తుందో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏఐ గురించి ప్రస్తావిస్తున్నట్లు ట్వీట్‌లో తెలిపారు.
చదవండి👉 శాంసంగ్ కొంపముంచిన చాట్‌జీపీటీ.. లీకైన రహస్య సమాచారం
Comments
Please login to add a commentAdd a comment