వాట్సాప్‌లో(WhatsApp) కూడా యూట్యూబ్ తరహాలో త్వరలో ప్రీమియం అకౌంట్ సర్వీసును అందించనుంది. అంటే ఈ ప్రత్యేక సర్వీస్‌ను పొందాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేయనుంది. ప్రస్తుతం పలువురు బీటా వినియోగదారులతో ఈ కొత్త వెర్షన్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త సర్వీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్లకు ప్రీమియం మెనూ, అదనపు ఫీచర్లుంటాయని తెలిపింది. అయితే సాధారణ యూజర్లు కంగారుపడాల్సిన అవసరం లేదని ఈ కొత్త WhatsApp ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కేవలం వాట్సాప్ బిజినెస్ వెర్షన్ కోసం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
వాళ్ల కోసమే ప్రీమియం సర్వీస్
కొత్తగా రాబోతోన్న ఈ సర్వీస్‌లో ప్రత్యేక నేమ్‌తో వాట్సాప్ కాంటాక్ట్ లిస్టునూ క్రియేట్ చేసుకుని అందరికీ షేర్ చేసుకోవచ్చు. అంతేకాక ఏకకాలంలో 10 డివైజ్‌లలో లాగిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రీమియం వెర్షన్‌లో 32 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చ. వీటికి ఎంత వరకు ఛార్జ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
కాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా మెటా ఇప్పటికే చాలా ఆదాయాన్ని పొందుతుంది. ఎలాంటి ప్రకటనలు లేదా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు వంటి ఆదాయ వనరులు లేకుండా సంస్థ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న ఏకైక సేవ WhatsApp మాత్రమే. అందుకే దీని నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించాలని సంస్థ భావిస్తోంది. అందుకోసమే నిర్దిష్ట వ్యాపారాల కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురాబోతందని తెలిపింది. వాట్సాప్‌లో కొత్తగా రాబోతున్న ప్రీమియం వర్షన్ ఐచ్ఛికం మాత్రమేనని తప్పనిసరిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ వెల్లడించింది.
చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ!
Comments
Please login to add a commentAdd a comment