Chiru 154: చిరంజీవి -బాబీ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్‌ | Mega154: Bobby To Announce A Special Surprise On Chiranjeevis Birthday | Sakshi
Sakshi News home page

Chiru 154: చిరంజీవి -బాబీ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్‌

Published Sat, Aug 21 2021 8:41 PM | Last Updated on Sat, Aug 21 2021 8:48 PM

Mega154: Bobby To Announce A Special Surprise On Chiranjeevis Birthday - Sakshi

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆయన సినిమాల అప్‌డేట్‌లు ప్రస్తుతం క్యూ కడుతున్నాయి. ఆగ‌స్ట్ 22న చిరంజీవి 66వ వసంతంలోకి  అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్‌డేట్‌లతో ఫ్యాన్స్‌ సంతోషంలో మునిగిపోయారు.  ప్రస్తుతం చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మెగా వేవ్‌ పేరుతో ఆదివారం సాయంత్రం 4.05గంటలకు అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. చిరు 154వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయిపోయింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. అంతేకాకుండా లూసిఫర్‌ రీమేక్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి గాడ్‌ ఫాదర్‌ టైటిల్‌ను చిత్ర బృందం అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 


చదవండి : చిరు సాయం లేకుంటే హేమ చనిపోయేది.. రాజా రవీంద్ర షాకింగ్‌ కామెంట్‌
బర్త్‌డే స్పెషల్‌ : చిరు 153 మూవీ టైటిల్‌ వచ్చేసింది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement