
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో ఆమె నటించిన “కాతు వాకుల రెండు కాదల్” సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా శాకుంతలం సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశానంటూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకుంది.
కాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను ణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శకుంతలగా సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment