
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ నిర్మించింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ అప్‌డేట్‌ను షేర్ చేశారు. ‘యశోద’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మే5 ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఈ చిత్రంలోవరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది.
Team #Yashoda wishes #EidMubarak 😇
— Sridevi Movies (@SrideviMovieOff) May 3, 2022
Stay tuned for First glimpse on May 5th, 11:07AM🔥#YashodaTheMovie @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan #ManiSharma @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/kSFlwdBKsB
Comments
Please login to add a commentAdd a comment