ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ చోట్ల కొండచరియలు విరిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. ఎన్‌హెచ్, బీఆర్‌ఓ బృందాలు ప్రస్తుతం రోడ్డును క్లియర్ చేసే పనులు చేపడుతున్నాయి.
చమోలి- నందప్రయాగ్ మధ్య మూడు ప్రదేశాలలో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. చోప్టా మోటర్‌వేపై గోడ కూలిపోవడంతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నందప్రయాగ్ సమీపంలో రహదారి కూడా మూసుకపోవడంతో 700 మంది బద్రీనాథ్ యాత్రికులు చమోలి, పిపల్‌కోటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, గౌచర్ మరియు ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరికి అధికారులు బిస్కెట్లు, తాగునీరు అందించారు.
నంద్‌ప్రయాగ్‌లో హైవే మూసుకుపోయిన కారణంగా, కౌటియల్‌సైన్ నందప్రయాగ్ మోటార్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాయి. సోన్లా సమీపంలో భారీగా బండరాళ్లు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్-బద్రీనాథ్ హైవేలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్ బృందం జేసీబీతో మట్టిని తొలగించే పనులు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment