క్రేజీ కాంబో.. రాజమౌళి- మహేశ్‌ బాబు మూవీ అప్‌డేట్ వచ్చేసింది! | Director SS Rajamouli Latest Movie With Mahesh Babu Update | Sakshi
Sakshi News home page

SS Rajamouli: న్యూ ఇయర్ వేళ.. రాజమౌళి- మహేశ్‌ బాబు మూవీ అప్‌డేట్ చూశారా?

Published Wed, Jan 1 2025 2:47 PM | Last Updated on Wed, Jan 1 2025 3:14 PM

Director SS Rajamouli Latest Movie With Mahesh Babu Update

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.  ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని జనవరి 2న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. న్యూ ఇయర్‌ వేళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్‌ మొదలు కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.

కాగా.. మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్‌ చిత్రంపై మరోవైపు రూమర్స్‌ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై  ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్‌ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు.  SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్‌ పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది.  ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే‌ అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ అయింది.

హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా..?

ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న  ఈ సినిమా షూటింగ్‌ జనవరి 2025 నుంచి ప్రారంభం కానుంది. అయితే,  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ క్రమంలో హీరోయిన్‌ను ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్‌ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్‌ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్‌. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

ఆమె పలు హాలీవుడ్‌ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు  బాలీవుడ్‌ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement