
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. జనతా గ్యారేజ్’(2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పుడు కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ చేస్తుండగా, కొరటా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే ఈ ఇద్దరూ కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొరటాల- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందది? ఈ సినిమా కథేంటి?.ఇలా రకరకాల ప్రశ్నలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉంటుందని, స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారట. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో బరిలోకి దిగిన హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? చివరికి ఆయన అనుకున్నది సాధిస్తాడా లేదా? అనే అంశాలతో ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి : వైరల్ అవుతోన్న జూ. ఎన్టీఆర్ అరుదైన వీడియో..
కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్.. కారణం ఇదేనట