Central Government Likely To Revise National Pension Scheme - Sakshi
Sakshi News home page

NPS Update: నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ కింద 45 శాతం పెన్షన్‌? ఆర్థిక శాఖ వివరణ

Published Sat, Jun 24 2023 1:05 PM | Last Updated on Sat, Jun 24 2023 1:48 PM

NPS update Government likely to revise National Pension Scheme Finance Ministry explanation - Sakshi

కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) కింద వారు ఉద్యోగ విరమణకు మందు చివరిగా అందుకున్న వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ఒక కమిటీ చర్చిస్తోందని, ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొంది.

ఎన్‌పీఎస్ కింద ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పెన్షన్ ఖచ్చితమైన శాతం గురించి పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ‘గత బడ్జెట్ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ, ప్రస్తుతం చర్చల స్థితిలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదు’ ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చింది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ తర్వాత వారి చివరి వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్‌ వచ్చేలా నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించాలని భావిస్తోందంటూ రాయిటర్స్‌ కథనం వెలువరించింది.

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement