కేంద్ర ఉద్యోగుల్లో కొందరికి పాత పెన్షన్‌ | Select central govt employees get one-time option to opt for old pension scheme | Sakshi
Sakshi News home page

కేంద్ర ఉద్యోగుల్లో కొందరికి పాత పెన్షన్‌

Published Sun, Mar 5 2023 4:56 AM | Last Updated on Sun, Mar 5 2023 4:56 AM

Select central govt employees get one-time option to opt for old pension scheme - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్‌ విధానం(ఎన్‌పీఎస్‌) అమల్లోకి వచ్చిన 2003 డిసెంబర్‌ 22వ తేదీకి ముందే ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ‘పాత పెన్షన్‌’ స్వీకరించే అవకాశం పొందారు. అంటే ఆ తేదీ కంటే ముందే రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌/అడ్వర్ట్‌టైజ్డ్‌ చేసిన పోస్టుల్లో చేరిన ఉద్యోగులు మాత్రమే పాత పెన్షన్‌ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరేందుకు వన్‌–టైమ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర సిబ్బంది శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

‘ఎన్‌పీఎస్‌ నోటిఫికేషన్‌కు ముందే ప్రకటించిన పోస్టులు/ఖాళీలకు అనుగుణంగా ఎంపికైనందున పాత పెన్షన్‌ స్కీమ్‌ను తమకు వర్తింపజేయాలని 2003 డిసెంబర్‌ 22కు ముందు కేంద్ర ఉద్యోగాల్లో చేరిన వారి వినతులు మాకు అందాయి. పలు రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనళ్లు వెలువర్చిన తీర్పులు, ఆ ఉద్యోగుల అభ్యర్థనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఉత్వర్వులో కేంద్రం పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement