మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! | Manchu Vishnu Shares Kannappa Teaser Release Update Goes Viral | Sakshi
Sakshi News home page

Kannappa Teaser: మంచు విష్ణు కన్నప్ప మూవీ.. టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Fri, Jun 7 2024 7:45 PM | Last Updated on Fri, Jun 7 2024 8:20 PM

Manchu Vishnu Shares Kannappa Teaser Release Update Goes Viral

టాలీవుడ్‌ డైనమిక్ స్టార్ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి సూపర్ స్టార్స్‌ నటిస్తున్నారు. కాగా.. ఇటీవల కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌ను  జూన్ 14న కన్నప్ప రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ  మేరకు మంచు విష్ణు కన్నప్ప స్పెషల్‌ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ‌గుర్రం మీద విష్ణు కూర్చుని కనిపించారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement