![Tollywood Hero Manchu Vishnu Movie Kannappa Shoot Starts Today - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/28/kannappa.jpg.webp?itok=Eito74hu)
టాలీవుడ్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మళ్లీ షురూ అయింది. తాజాగా న్యూజిలాండ్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇప్పటికే 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్తా గ్యాప్ తర్వాత కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు తాజాగా షూటింగ్ ప్రారంభించింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన తండ్రి మోహన్ బాబు, విష్ణు మంచు వీడియోలో కనిపించారు. ఈ షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కన్నప్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు.
న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
The second schedule of #Kannappa in #NewZealand is in full swing !!@iVishnuManchu #Prabhas #Vishnu pic.twitter.com/UQ67xfJVCS
— Aryan (@chinchat09) February 28, 2024
Comments
Please login to add a commentAdd a comment