e - kyc
-
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్!
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ 'దేవేంద్ర సింగ్ చౌహాన్' ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో రేషన్ మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఈ-కేవైసీ తప్పనిసరి. కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలందరూ తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు ఇంకా ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులకు ఉపశమనం కలిగిస్తూ మరో నెల రోజులు అవకాశం కల్పించారు. రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి గడువును 2024 జనవరి 31 పొడిగించారు. ఈ గడువు లోపల ఈ-కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గత రెండు నెలలుగా రేషన్ డీలర్లు ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీని కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తులు వంటివి తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే.. నిర్దిష్ట గడువు లోపల ఈ-కేవైసీ అప్డేట్ పొందని రేషన్ కార్డులను, నకిలీ రేషన్ కార్డులుగా గుర్తించి.. వాటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే ప్రజలు అప్పటి వరకు పొందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. 2023 డిసెంబర్ 30 వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు 70.80 శాతం అని తెలుస్తోంది. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో (87.81 శాతం) ముందు వరుసలో ఉన్నట్లు.. అతి తక్కువ నమోదైన జిల్లాలో వనపర్తి (54.17 శాతం) ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. -
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం .. ఈ–కేవైసీ చేస్తేనే పీఎం కిసాన్
సాక్షి, అమరావతి: ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరులోపు రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని, లేకపోతే జనవరిలో విడుదల చేయనున్న 13వ విడత పీఎం కిసాన్ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ–కేవైసీ ప్రక్రియ ఉద్దేశం రైతుల వాస్తవికతను ధ్రువీకరించుకోవడం కోసమేనని కేంద్రం వెల్లడించింది. నెలాఖరులోపు పూర్తిచేయాలి : సీఎస్ అర్హులైన లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం ఆదేశాల మేరకు ఈ–కేవైసీ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. రాష్ట్రంలో క్రియాశీలక రైతులు 49,13,283 మంది ఉండగా, వారిలో ఈ నెల 21వ తేదీ వరకు 35,16,597 రైతులకు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, 13,96,686 మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లో ఉందని సీఎస్ చెప్పారు. వారికి ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులందరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందేలా వెంటనే ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలోపు 13వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. -
ఈ–పంట నమోదు అంతా పారదర్శకం
సాక్షి, అమరావతి : ‘ఒకప్పుడు సాగు చేసే వారొకరు. కొనుగోలు కేంద్రంలో అమ్మేవారు మరొకరు. సాగు భూమి ఉన్నా, లేకున్నా.. సాగు చేసినా చేయకపోయినా వీఆర్వో సర్టిఫై చేస్తే చాలు.. షావుకార్లు, దళారీలు, ఏజెంట్ల ద్వారా మిల్లర్లు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి జేబులు నింపుకునేవారు. కానీ ఇప్పుడలా కాదు. ప్రభుత్వ చర్యలతో ‘ఈ – పంట’ నమోదుతో దళారీ వ్యవస్థకు చెక్‌పడింది. సాగుదారులే అమ్ముకోవాలి. వారి ఖాతాలకే సొమ్ములు జమవ్వాలి. ఈ పంట నమోదు ఒక్క ధాన్యం కొనుగోలుకే కాదు.. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ ఫలాలన్నింటికీ వర్తింప చేసింది. ఈ వాస్తవాలన్నింటినీ ‘ఈనాడు’ పత్రిక విస్మరించి అసత్యాలు ప్రచారం చేస్తోంది’ అని వ్యవసాయ శాఖ అధికారులు, ఆ రంగం నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహంతో వ్యవసాయం పండుగలా మార్చుకున్న రైతులను పక్కదారి పట్టించేలా రోజుకో తప్పుడు కథనాన్ని వండివార్చడమే పనిగా పెట్టుకుందని చెబుతున్నారు. నిత్యం రోత రాతలతో రైతులను అయోమయానికి గురి చేసేందుకు విఫలయత్నం చేస్తోందంటూ.. ఇదిగో వాస్తవాలు అంటూ వివరిస్తున్నారు. ఇంతకంటే ‘రోత రాత’ ఉంటుందా? ‘రామచంద్రపురంలో గుణ్ణం వెంకటేశ్వరరావు అనే రైతు పదెకరాల్లో పంట సాగు చేస్తే మూడెకరాల్లోనే ఈ–పంట నమోదైందని, ధాన్యం అమ్ముదామని వెళ్తే డేటా లేదని రెండు నెలలుగా తిప్పించుకొని, చివరికి తామేం చేయలేమని చేతులెత్తేశారంటూ ‘ఈనాడు’ రాసుకొచ్చింది. వాస్తవానికి ఈయన 7.19 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేసినట్టుగా ఈ–పంటలో నమోదైంది. పంట కొనుగోలు యాప్‌లో అతని వివరాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ నెల 18న స్థానిక ఆర్బీకేలో ఇతను పండించిన 296 క్వింటాళ్ల ధాన్యాన్ని (ఎఫ్టీఒ నెం. 904390025 2200135) అమ్ముకున్నారు. ఈ వాస్తవాన్ని పట్టించుకోని ‘ఈనాడు’ ఈ–పంట నమోదు వల్ల ఈ రైతుకేదో అన్యాయం జరిగి పోయిందంటూ గగ్గోలు పెట్టింది. ఇలా తప్పుడు ఉదాహరణలతో రైతులను గందరగోళానికి గురిచేసి, ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి విఫల యత్నం చేస్తోంది. తాము పండించిన పంటను ఆర్బీకేల వద్ద అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ఎంతో మంది రైతులు పొందుతుంటే లేదు.. లేదంటూ ఈ వ్యవస్థపై విషం కక్కుతోంది. ఆర్బీకే వ్యవస్థకు పక్క రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రశంసలు వ్యక్తమవుతుంటే ‘ఈనాడు’ అవాస్తవాలను అచ్చేస్తోంది’ అని ఆధారాలతో సహా స్పష్టం చేశారు. 2.33 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ ‘గతంలో సీజన్లో 2,500కు మించి కేంద్రాలుండేవి కాదు. అలాంటిది ప్రస్తుతం ప్రభుత్వం 7 వేలకు పైగా ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఇవేమీ ఈనాడుకు కన్పించడం లేదు. ఈ–పంటలో నమోదైన రైతులకు ఈ–కేవైసీ జరగడం లేదని, ఈ కారణంగా రైతులకు అన్యాయం జరిగిపోతోందని అపోహలకు తావిచ్చేలా రాసుకొచ్చింది. నిజంగా ఈ–కేవైసీ జరగకపోతే గత మూడేళ్లలో ఈ–పంట నమోదు ఆధారంగానే రూ.43,550 కోట్ల విలువైన 2.33 కోట్ల టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వం ఎలా సేకరించింది? గత ఖరీఫ్‌లో ఈ–కేవైసీ ఆధారంగా 40,30,969 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ప్రస్తుత రబీలో ఇప్పటి వరకు 14,76,828 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండటం ‘ఈనాడు’ కంటికి ఎందుకు కన్పించడం లేదు? గడిచిన ఖరీఫ్‌లో 112.26 లక్షల ఎకరాలు, రబీలో 52.94 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్ బుకింగ్ జరిగింది. పైగా ఖరీఫ్‌లో 84 శాతం, రబీలో 80 శాతం ఈ కేవైసీతోనే పంటలు కొనుగోలు చేశారు’ అని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ వాస్తవాలూ కనిపించవా? ఈ–పంట’ నమోదును రాష్ట్ర ప్రభుత్వం 2019 రబీ సీజన్ నుంచి అమలులోకి తెచ్చింది. రైతు భరోసా – యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీ అండ్ యూడీపీ) యాప్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాస పంటలతో పాటు సామాజిక వనాలను కూడా గ్రామ స్థాయిలో ఆర్బీకేల్లో పనిచేస్తోన్న వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేస్తున్నారు. రెవెన్యూ వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా భూ యజమాని వివరాలకు వాస్తవ సాగుదారుని వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిర్ధారించుకున్న తర్వాత ఆధార్ ఆధారంగా ఈ–కేవైసీ నమోదు చేస్తున్నారు. ప్రతి రైతుకు రసీదు ఇస్తున్నారు. ఈ పంట నమోదు వివరాలను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వద్ద ఉన్న పంట కొనుగోలు యాప్‌తో అనుసంధానిస్తున్నారు. ఈ–పంట రసీదునే ప్రామాణికంగా తీసుకొని పంట కొనుగోలుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఈ వాస్తవాలన్నీ రైతులందరికీ కనిపిస్తుంటే ఒక్క ఈనాడుకు మాత్రమే కనిపించడం లేదు కాబోలు. సీజన్ ముగిసే వరకు ఈ–కేవైసీ నమోదు ‘ఈ పంటతో తంటా’ శీర్షికన ‘ఈనాడు’లో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం. ఈ పంట నమోదు ప్రారంభమైన తర్వాత కచ్చితమైన సాగుదారులెవరో గుర్తించగలిగాం. పైగా సీజన్ ముగిసే వరకు ఈ పంట నమోదు చేస్తున్నాం. రబీ పంట కాలానికి సంబంధించి ఈ నెల 25వ తేదీ వరకు ఈ పంట నమోదుకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఆర్బీకేల్లో నమోదు చేసుకొని, ఈ–కేవైసీ చేసుకొని తమ పంటను అమ్ముకోవచ్చు. పంట కొనుగోలుతో పాటు సంక్షేమ ఫలాలను కూడా ఈ పంట ప్రామాణికంగానే అందిస్తున్నాం. ఈ ఏడాది ముందస్తుగా సార్వ పంట నమోదు ప్రారంభిస్తున్నందున 25వ తేదీ తర్వాత రబీ పంట నమోదును నిలిపి వేస్తాం. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ పంట వివరాల నమోదు ప్రారంభిస్తున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
పాలసీ పత్రాలు ఈ-రిపాజిటరీలో పదిలం
మూడేళ్లకోసారి రూ.75 వేల చొప్పున 15 ఏళ్లపాటు ఆదాయమొచ్చే ఇన్సూరెన్స్ పాలసీని మూర్తి గారు తీసుకున్నారు. తొలి విడత సొమ్ము మామూలుగానే చేతికి అందింది. పాలసీకి సంబంధించిన కీలక పత్రాలను పోగొట్టుకోవడంతో రెండో విడత డబ్బు తీసుకోవడం కష్టమైంది. అతికష్టమ్మీద, ఏడాది తర్వాత ఆ డబ్బు అందింది. దానికోసం ఆయన నానా కష్టాలు పడాల్సి వచ్చింది. క్లెయిమ్‌లను పరిష్కరించుకోవాలన్నా, చెల్లింపులు తీసుకోవాలన్నా పాలసీ డాక్యుమెంట్లన్నీ భద్రంగా ఉంచడం, బీమా కంపెనీలు కోరినపుడు వాటిని సమర్పించడం అత్యవసరం. వీటిలో ఏ డాక్యుమెంటు మిస్సయినా ఆ పెట్టుబడి అంతా నిష్ఫలంగా మారే అవకాశముంది. అదృష్టవశాత్తూ, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ-రిపాజిటరీలను బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ గతేడాది ప్రారంభించింది. ఈ-రిపాజిటరీ ఏమిటంటే... ఖాతాదారులు తమ పాలసీ వివరాలను డిజిటల్ ఫార్మాట్లో భద్రపర్చుకునే సౌకర్యమే ఇ-రిపాజిటరీ. వివిధ బీమా కంపెనీలకు చెందిన పాలసీ డాక్యుమెంట్లను ఒకే ఈ-అకౌంట్లో దాచుకోవచ్చు. అంటే, మీకు హెల్త్ పాలసీ ఒక కంపెనీది, జీవిత బీమా మరో కంపెనీది ఉన్నా ఒకే అకౌంట్లో ఆ వివరాలు భద్రపర్చవచ్చు. క్లెయిమ్ సమయంలో పాలసీదారుడైనా, కంపెనీ అయినా ఒకే క్లిక్‌తో పాలసీ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట. ఈ-కేవైసీ ద్వారా బీమా కంపెనీల సేవలు వేగవంతం కావడంతో పాటు డాక్యుమెంట్ ఫోర్జరీలను, పాలసీదారుల గుర్తింపులో మోసాలను నివారించవచ్చు. డాక్యుమెంట్ల కోసం పాలసీదారును అడగాల్సిన అవసరం లేకుండానే బీమా కంపెనీలు కేవైసీ తనిఖీల ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతాయి. ఈ-రిపాజిటరీల ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లను దాచడానికి స్టోరేజీ అవసరం ఉండదు. అంతా ఉచితమే... బీమా కస్టమర్లందరికీ ఈ-రిపాజిటరీ సేవలను ఉచితంగా అందిస్తారు. యూఐఏడీఐలో నమోదు చేసుకుని, ఆధార్ కార్డు ఉన్న వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. బీమా కంపెనీలకు ఈ-రిపాజిటరీ ఏజెంట్లుగా వ్యవహరించడానికి ఐదు కంపెనీలను ఐఆర్డీఏ ఎంపిక చేసింది. ఖాతాదారులు తమకు నచ్చిన కంపెనీకి తమ పాలసీల వివరాలను అందిస్తే సరిపోతుంది. తర్వాత, వాస్తవ కాలానుగుణంగా ఈ డేటాను సదరు కంపెనీ అప్డేట్ చేస్తుంటుంది. ఒక్కో ఖాతాదారునికి ఒక్కో లింక్‌ను కంపెనీ ఇస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు, తర్వాతి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ఫండ్ విలువ, మెచ్యూరిటీ డేట్ మొదలైన వివరాలన్నీ కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. పాలసీదారులకు ఏవైనా సందేహాలుంటే బీమా సంస్థ, ఏజెన్సీ కంపెనీ సమాధానమిస్తాయి. పాలసీల డీమెటీరియలైజేషన్ పుణ్యమా అని బీమా కంపెనీల సేవా ప్రమాణాలు మెరుగవుతాయి. నిర్దిష్ట బీమా అవసరాలు కలిగిన ఖాతాదారులను గుర్తించడం బీమా కంపెనీలకు సులభమవుతుంది. స్నేహిల్ గంభీర్ సీఓఓ, అవీవా లైఫ్ ఇన్సూరెన్స్