అనంతపురం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను జనవరిలో నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా నార్పలలో విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలుగు పండిట్లు, పీఈటీల పదోన్నతి విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే జీఓ విడుదల చేస్తామన్నారు.