ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ విస్తరణ లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ విస్తరణ లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జనవరి 15న రాత్రి హైదారబాద్ చేరుకుని, 16న వరంగల్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. 17వ తేదీన విజయవాడలో పర్యటిస్తారు. అయితే సంక్రాంతి సందర్భంగా నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా సంబరాల్లో ఉండనున్న దృష్ట్యా తెలంగాణలో అమిత్ షా పర్యటన తేదీలను మారిస్తే బాగుంటుందనే ప్రతిపాదన చేయనున్నట్టు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.