'నిధులు ఎక్కడికి వెళ్లాయో తేల్చండి' | congress leader shabbir ali slams BJP | Sakshi
Sakshi News home page

'నిధులు ఎక్కడికి వెళ్లాయో తేల్చండి'

Published Sat, Jun 11 2016 3:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

congress leader shabbir ali slams BJP

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల నిధులు ఇచ్చామంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. అవి ఎలా ఇచ్చారో, వేటికి ఇచ్చారో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు ఇస్తే అవి ప్రజలకు చేరకుండా ఎక్కడికి వెళ్లాయో లెక్కతేలాలన్నారు. ఈ మేరకు ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇస్తామన్న4 వేల మెగావాట్ల రామగుండం విద్యుత్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ రాలేదన్నారు. హైకోర్టు విభజన ఇంకా జరగలేదని, మోదీ సర్కారు చేసిందేమిటని నిలదీశారు. తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు అమిత్‌షాకు లేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసి ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement