![BJP Leader Laxman Says Amit Shah Visit Telangana On13Th July - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/12/laxman_0.jpg.webp?itok=y_QTIfln)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుతో సీఎం కూర్చీ కోసం పాకులాడుతూ.. ప్రజా సమస్యలు పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ప్రస్తుతం ప్రజలు మావైపే ఉన్నారని తెలిపారు. ఈ యాత్ర వల్ల 2019 ఎన్నికలకు మిషన్ 60 ప్లస్ లక్ష్యమని లక్ష్మణ్ పేర్కొన్నారు. రేపు రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారని తెలిపారు.
‘టార్గెట్ తెలంగాణతో షా ఇక్కడికి రాబోతున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు. 2019 ఎన్నికల నిమిత్తం ఉన్న కమిటీతో ప్రత్యేక సమావేశం. అంతేకాక సంస్థాగతంగా బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేస్తారు. అనంతరం బేగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తారు.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఇప్పటికే తెలంగాణ జన చైతన్య యాత్ర చేపట్టాం. 2019 ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో గతంలో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతాం. అంతేకాక విస్తారంగా కార్యక్రమాలు చేపడుతామని’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment