State BJP president Laxman
-
‘2019 ఎన్నికల్లో 60 ప్లస్ లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుతో సీఎం కూర్చీ కోసం పాకులాడుతూ.. ప్రజా సమస్యలు పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రజలు మావైపే ఉన్నారని తెలిపారు. ఈ యాత్ర వల్ల 2019 ఎన్నికలకు మిషన్ 60 ప్లస్ లక్ష్యమని లక్ష్మణ్ పేర్కొన్నారు. రేపు రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారని తెలిపారు. ‘టార్గెట్ తెలంగాణతో షా ఇక్కడికి రాబోతున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు. 2019 ఎన్నికల నిమిత్తం ఉన్న కమిటీతో ప్రత్యేక సమావేశం. అంతేకాక సంస్థాగతంగా బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేస్తారు. అనంతరం బేగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఇప్పటికే తెలంగాణ జన చైతన్య యాత్ర చేపట్టాం. 2019 ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో గతంలో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతాం. అంతేకాక విస్తారంగా కార్యక్రమాలు చేపడుతామని’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. -
చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలం
వర్షాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నా సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కరెంటు, మంచినీళ్లు, ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని చెప్పారు. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని, భయానక వాతావరణంలో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారన్నారు. కోజికోడ్‌లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల తర్వాత సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన తన నియోజకవర్గం ముషీరాబాద్, తర్వాత కుత్భుల్లాపూర్‌లోని నిజాంపేట, బండారి లే ఔట్లలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి పాలు, బ్లాంకెట్లు, బిస్కెట్లు, అత్యవసర ఔషధాలు పంపిణీ చేశారు. -
గెలుపు గుర్రాలకోసం అన్వేషణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ * 2019లో అధికారం మాదే సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారికోసం సర్వే చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. జిల్లాల వారీగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులు.., వారిలో పోరాట పటిమ కలిగినవారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్టుగా చెప్పారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షపార్టీ బీజేపీయేనన్నారు. 2019లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామన్నారు. కేవలం ప్రతిపక్షంగా మిగిలిపోవడానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా లేవని, టీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటాలు చేయడానికి పార్టీ కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారని చెప్పారు. బీజేపీ పోరాటాల ఆరంభాన్ని ఆగస్టు రెండోవారం నుంచి చూస్తారని, సెప్టెంబర్ 17 నాటికి బీజేపీ పోరాటం అంటే ఏమిటో టీఆర్ఎస్ ప్రభుత్వం రుచి చూ డాల్సి ఉంటుందని లక్ష్మణ్ హెచ్చరించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ ఏలుబడి నుంచి విముక్తిపొంది భారతదేశంలో విలీనమైందని, ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చేదాకా ఇప్పటి సీఎం కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రపంచంలోనే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించని జాతి తెలంగాణ ఒక్కటేనన్నారు. స్వంత రాష్ట్రంలోనూ ఆత్మగౌరవంతో, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేకుండా పోయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా సీఎం కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లకోసం, ఎంఐఎంతో చీకటిదోస్తీ వల్లనే సెప్టెంబర్ 17నవిమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపించారు. ప్రభుత్వమే నిర్వహించాలి.. సెప్టెంబర్ 17న ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. దీనిపై ఆగస్టు మొదటివారంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభం అవుతుందని, ఈ ఉద్యమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను జనంలో చర్చకు పెడతామన్నారు. అక్టోబర్‌లో రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నట్టు చెప్పారు. నెలాఖరులోపు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను పూర్తి చేస్తామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో వైఫల్యాలు, అవినీతి ఉన్నాయన్నారు. రెండు బెడ్రూముల ఇళ్లు, దళితులకు భూపంపిణీ, కేజీ టు పీజీ దాకా ఉచిత విద్య వంటివాటివెన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేయలేదన్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారికి న్యాయసహాయం అందిస్తామన్న మజ్లిస్ తీరును, మజ్లిస్‌కు టీఆర్ఎస్ మద్దతును ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు. -
కాంగ్రెస్, వామపక్షాలకు కనువిప్పు కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: బీజేపీపై మతతత్వ ముద్రతో విషం చిమ్మిన కాంగ్రెస్, వామపక్షాలకు అస్సాం ఎన్నికల ఫలితాలతో కనువిప్పు కలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అస్సాంలో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సంబరాలను జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 40 శాతం మైనారిటీ ఓటర్లున్న అస్సాంలో బీజేపీ ఘనవిజయం సాధించడం ప్రజలు తమ పార్టీవైపే ఉన్నారన్న విషయాన్ని స్పష్టంచేస్తోందన్నారు. టీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలను, నియంతృత్వ విధానాలను నిలువరించేవిధంగా బీజేపీ పోరాడుతుందన్నారు. సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత విమర్శలకు, బెదిరింపులకు దిగడం సరైందికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, నేతలు ప్రేమేందర్‌రెడ్డి విజయలక్ష్మి, సత్యనారాయణ, ఎస్.మల్లారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.