చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలం | Bjp leader laxman Comments on State government | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కారు విఫలం

Published Tue, Sep 27 2016 2:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలం - Sakshi

చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలం

వర్షాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నా సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కరెంటు, మంచినీళ్లు, ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని చెప్పారు. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని, భయానక వాతావరణంలో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారన్నారు. కోజికోడ్‌లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల తర్వాత సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన తన నియోజకవర్గం ముషీరాబాద్, తర్వాత కుత్భుల్లాపూర్‌లోని నిజాంపేట, బండారి లే ఔట్లలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి పాలు, బ్లాంకెట్లు, బిస్కెట్లు, అత్యవసర ఔషధాలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement