
జనవరి నుంచి పింఛను ఇస్తాం
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ : పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని యాళ్లవాని గరువుకు చెందిన వికలాంగురాలు సంది రాజ్యంకు దాతల సహకారంతో జనవరి నుంచి రూ.200 పింఛను ఇవ్వనున్నట్టు ఎంపీడీవో ఆర్.విజయరామరాజు చెప్పారు. ‘మూడేళ్లు పింఛను ఇచ్చి.. ఆనక ఆపేశారు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై డీఆర్‌డీఏ పీడీ వై.రామకృష్ణ, ఎంపీడీవో రామరాజు స్పందించారు. రాజ్యంకు సంబంధించిన రికార్డులను ఎంపీడీవో పరిశీలించారు.
ఆమెకు వైకల్యం శాతం తక్కువగా ఉండటంవల్ల సదరం క్యాంపులో ఆమె పింఛను నిలుపుదల చేశారని ఎంపీడీవో పేర్కొన్నారు. అరుుతే, ఆమెకు ముందువెనుకా ఎవరూ లేనందున మానవతా ధృక్ఫథంతో దాతల సహకారంతో వచ్చే నెలనుంచి పింఛను అందేలా ఏర్పాటు చేస్తామన్నారు. రాజ్యం భౌతిక పరిస్థితులు, శారీరక పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించి ప్రభుత్వ సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.