కరోనా ముగిసింది.. ఉద్యోగాలకు ఏం భయం లేదనుకుని 2024లో అడుగుపెట్టిన టెకీలకు ఈ ఏడాది కూడా చుక్కెదురవుతోంది. 2024 ప్రారంభమైన మొదటి నెల కావొస్తున్నా.. ఉద్యోగుల్లో లేఆప్స్ భయం పోవడం లేదు. ఎందుకంటే జనవరిలో ఇప్పటికి ఏకంగా 24,564 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవడమే.
మొదటి నెలలో లేఆఫ్స్.ఎఫ్‌వైఐ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు 91 టెక్ కంపెనీలు 24,564 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ కంపెనీ గత శుక్రవారమే తమ కంపెనీ సిబ్బందిలో 700 మందిని తొలగిస్తున్నట్ల ప్రకటించిన సంగతి అందరికి తెలుసు.
2023లో మొత్తం 1187 టెక్ కంపెనీల నుంచి 2,62,595 మంది ఉయోగాలను కోల్పోయినట్లు లేఆఫ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi నుంచి వచ్చిన డేటా ఆధారంగా తెలిసింది. 2024 ప్రారంభంలోనే ఆన్‌లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది.
గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక మెమోలో వెల్లడించింది.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌లను తొలగించింది. ఇవన్నీ చూస్తుంటే టెక్ ఉద్యోగులకు 2024 కూడా కలిసి రాదేమో అనే భావన చాలామందిలో మొదలైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment