హైదరాబాద్: తెలంగాణలో జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు చెప్పారు. పల్లె ప్రగతి ద్వారా సమ్మిళిత గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామ పౌర సేవాకేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాహకులుగా మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. వడ్డీలేని రుణాలు కొనసాగిస్తామని కేటీఆర్ చెప్పారు.