ట్రంప్ ఎఫెక్ట్: భారీగా పెరిగిన కొలువులు
అమెరికా వ్యాపార సంస్థలు ఒక్క నెలలో భారీగా ఉద్యోగులను నియమించుకున్నారు. జనవరి నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా పుంజుకున్నట్టు తాజా నివేదికలో తేలింది. ఆయా వాణిజ్య ఇతర సంస్థలు కొత్తగా 2లక్షల 27 వేల కొత్త ఉద్యోగాలను అదనంగా జోడించినట్టు తెలిపింది. అయితే ఈ సంఖ్య లక్షా75 వేలుగా ఉండగనుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
చిల్లర వ్యాపారం, నిర్మాణం, ఆర్థిక కార్యకలాపాల్లో ఈ ఉద్యోగాలు సాధించినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక తేల్చింది. గత డిశెంబర్ 157,000 ఉద్యోగాలతో పోలిస్తే ఈ నెలలో పెరిగినట్టు తెలిపింది. అలాగే 4.8 శాతం నిరుద్యోగ రేటుతో, 7.6 మిలియన్ల నిరుద్యోగులు ఉన్నట్టు నివేదించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య భారీగా ఉన్నట్టు తెలిపింది. గత సెప్టెంబర్ తో పోలిస్తే గరిష్టంగా ఉంది.జనవరి 2009-17 మధ్య కాలంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో 11.25 మిలియన్ ఉద్యోగాల పెరుగుదల నమోదైనట్టు బ్యూరో పేర్కొంది.
మరోవైపు జనవరి నెల జాబ్ రిపోర్ట్ అంచనాలను మించి నమోదు కావడంతో అమెరికా మార్కెట్లు భారీలాభాలతో మొదలయ్యాయి.
కాగా ఫర్ అమెరికన్స్, హైర్ అమెరికన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే 10 ఏళ్ల కాలానికి 25 మిలియన్ల ఉద్యోగాల సృష్టించనున్నట్టు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.