17 జనవరి నుంచి 23 జనవరి, 2016 వరకు | vaara phalalu | Sakshi
Sakshi News home page

17 జనవరి నుంచి 23 జనవరి, 2016 వరకు

Published Sun, Jan 17 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

17 జనవరి నుంచి 23 జనవరి, 2016 వరకు

17 జనవరి నుంచి 23 జనవరి, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 ఇంటా బయటా ఎదురుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగు తాయి. కొన్ని సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళాకారులకు సన్మానాలు. గులాబీ, లేత పసుపు రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహీణి, మృగశిర 1,2 పా.)
 కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. మీ ప్రతిభకు గుర్తింపు. రాబడి కొంత పెరిగే అవకాశం. వ్యాపారాలు ఉత్సాహవంతం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 ఆర్థిక విషయాలు సంతృప్తికరం. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. మీ అంచనాలు నిజం కాగలవు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఈ వారం విజయాల బాటలో సాగుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. వివాహయత్నాలు సానుకూలం. భూ వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రాబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. తెలుపు, తేనె రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 మొదట్లో చికాకులు, మానసిక అశాంతి తప్పకపోవచ్చు. బంధువుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ పుంజుకుంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసు కుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయ వర్గాలకు పర్యటనల్లో మార్పులు. ఆకుపచ్చ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

 తుల: (చిత్త 3,4,
 స్వాతి, విశాఖ1,2,3 పా.)

 ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు సొమ్ము అందుతుంది. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. నీలం, నలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరి పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొత్త పనులకు శ్రీకారం. ఆస్తి వివాదాలు కొంత పరిష్కార మవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం లభిస్తుంది. రాబడి ఆశాజనకం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. లేత ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు గుర్తింపు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. భూ వివాదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలలో పురోగతి. వ్యాపారాల విస్తరణ  యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. లేత నీలం, నలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. రామరక్ష స్తోత్రం పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు తగిన గుర్తింపు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. నేరేడు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యపరంగా చికాకులు. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు. రాజకీయ వర్గాలకు పర్యటనల్లో మార్పులు. బంగారు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.
 
 సింహంభట్ల సుబ్బారావు
 జ్యోతిష్య పండితులు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement